లొకేషన్ వేటలో పడిన రాజమౌళి

Sunday,August 05,2018 - 10:39 by Z_CLU

సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేదు. కథ ఏంటనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ మాత్రం జోరుగా సాగుతోంది. ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమా మేటర్ ఇది. ప్రస్తుతం ఈ సినిమాకు లొకేషన్లు ఫిక్స్ చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా కోసం భారీ సెట్ వేసేందుకు, కెమెరామేన్ సెంధిల్ తో కలిసి లొకేషన్లు వెదుకుతున్నాడు జక్కన్న. రీసెంట్ గా హైదరాబాద్ సమీపంలోని కొల్లూరు గ్రామంలో ఓ లొకేషన్ చూసొచ్చారు. మరో 2 లొకేషన్లు కూడా చూసి వాటిలోంచి ఒక ప్లేస్ ను ఫిక్స్ చేయబోతున్నారు.

ప్రస్తుతం అరవిందసమేత అనే సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. అటు రామ్ చరణ్, బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ రెండూ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ మూవీకి RRR అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.