'ఏఎన్నార్' రోల్ పై క్లారిటీ ఇచ్చిన హీరో

Saturday,August 04,2018 - 05:50 by Z_CLU

నందమూరి బాలయ్య నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘NTR’ ఇటివలే సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే…ఇప్పటికే ఓ షెడ్యూల్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా రోజురోజుకి స్టార్ కాస్టింగ్ పరంగా మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులోకి విద్యా బాలన్, రానా దగ్గుబాటి వంటి స్టార్స్  ఎంటర్ అవ్వడంతో మంచి క్రేజ్ వచ్చింది.  లేటెస్ట్ గా ఈ సినిమాలో సుమంత్ కూడా జాయిన్ అయ్యాడు.

నిన్నటి వరకూ ఈ సినిమాలో కీలకమైన ‘ANR’ రోల్ ఎవరు చేస్తారా అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేసాడు సుమంత్. ఈ సినిమా టీంతో వర్క్ చేయడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉందని,  ఈ ప్రేస్టిజియాస్ మూవీలో తాత రోల్ చేస్తునందుకు సంతోషంగా ఉందని సోషల్  మీడియా ద్వారా తెలియజేసాడు సుమంత్. సో అక్కినేని నాగేశ్వరరావు రోల్ పై క్లారిటీ వచ్చేసింది.. ఇక  సూపర్ స్టార్  కృష్ణ , శ్రీదేవి పాత్రలో ఎవరు  నటిస్తారో..చూడాలి.

https://twitter.com/iSumanth/status/1025670099720519680