జీ సినిమాలు ( 3rd జూన్ )

Sunday,June 02,2019 - 10:02 by Z_CLU

లవర్స్

నటీనటులు : సుమంత్ అశ్విన్, నందిత

ఇతర నటీనటులు : తేజస్వి మాడివాడ, చాందిని, షామిలి అగర్వాల్, సప్తగిరి, సాయి కుమార్ పంపన, MS నారాయణ, దువ్వాసి మోహన్ & అనిత చౌదరి

మ్యూజిక్ డైరెక్టర్ : జీవన్ బాబు

డైరెక్టర్ : హరినాథ్

ప్రొడ్యూసర్ : సూర్యదేవర నాగస్వామి & B. మహేంద్ర బాబు

రిలీజ్ డేట్ : 15 ఆగష్టు 2014

గర్ల్ ఫ్రెండ్ కోసం ఆరాటపడుతూ కనిపించిన ప్రతి అమ్మాయిని ట్రై చేసే సిద్దూ ఎఫర్ట్స్ చిత్ర వల్ల స్పాయిల్ అయిపోతాయి. అప్పటి వరకు తనను ఒక్కసారి కూడా చూడని సిద్దు, ఫోన్ లోనే చిత్రతో గొడవ పడతాడు. మరో వైపు ఇంకో అమ్మాయితో సిన్సియర్ గా లవ్ లో పడతాడు. ఆ తరవాత ఏం జరిగిందనేది ప్రధాన కథాంశం.

==============================================================================

గోదావరి

నటీనటులు : సుమంత్కమలినీ ముఖర్జీ

ఇతర నటీనటులు : నీతూ చంద్ర, C.V.L. నరసింహా రావుకమల్ కామరాజుతనికెళ్ళ భరణిశివగంగాధర్ పాండే తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K. M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : శేఖర్ కమ్ముల

ప్రొడ్యూసర్ : G.V.G. రాజు

రిలీజ్ డేట్ : 19 మే 2006

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సుమంత్కమలినీ ముఖర్జీ జంటగా నటించారు. న్యాచురల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రిలీజైన ప్రతి సెంటర్ లోను సూపర్ హిట్ అయింది.

==============================================================================

పిల్ల జమీందార్

నటీనటులు : నానిహరిప్రియబిందు మాధవి

ఇతర నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, M.S.నారాయణరావు రమేష్శివ ప్రసాద్తాగుబోతు రమేష్ధనరాజ్వెన్నెల కిశోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ సెల్వ గణేష్

డైరెక్టర్ : G. అశోక్

ప్రొడ్యూసర్ : D.S. రావు

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

న్యాచురల్ స్టార్ నాని తన కరియర్ లో చాలా ఇష్టపడి చేసిన సినిమా పిల్ల జమీందార్. పుట్టుకతో కోటీశ్వరుడైన యువకుడు జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడు..అనే సున్నితమైన కథాంశంతోపర్ ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది పిల్ల జమీందార్. అష్టా చెమ్మా తరవాత నానిఅవసరాల కలిసి చేసిన సినిమా ఇదే.

=============================================================================

చింతకాయల రవి
నటీనటులు : వెంకటేష్అనుష్క శెట్టి
ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్వేణు తొట్టెంపూడిశయాజీ షిండేచంద్ర మోహన్బ్రహ్మానందంసునీల్ఆలీ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : విశాల్ – శేఖర్
డైరెక్టర్ : యోగి
ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి
రిలీజ్ డేట్ : 2 అక్టోబర్ 2008
చింతకాయల రవి USA లో ఒక బార్ లో పని చేస్తుంటాడు. ఇండియాలో ఉండే తన తల్లికి మాత్రం అమెరికాలో పెద్ద సాఫ్ట్ ఇంజినీర్ అని చెప్పుకుంటాడు. ఈ లోపు రవి మదర్రవికి పెళ్ళి చేద్దామనుకునే ప్రాసెస్ లో సంబంధం చూసి ఫిక్స్ చేస్తుంది. అటు వైపు పెళ్ళి కూతురు ఫ్యామిలీ రవి ఎలాంటి వాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో సునీతను ఎంక్వైరీ చేయమని చెప్తారు. ఆ తరవాత ఏం జరుగుతుంది…? రవి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాదని తెలుసుకున్న సునీత ఏం చేస్తుంది..ఆ తరవాత కథ ఏ మలుపు తిరుగుతుంది అనేది జీ సినిమాలు లో చూడాల్సిందే.

==============================================================================

రామయ్యా వస్తావయ్యా
నటీనటులు : NTR, శృతి హాసన్సమంత రుత్ ప్రభు
ఇతర నటీనటులు : విద్యుల్లేఖ రమణ్, P.రవి శంకర్ముకేష్ రిషికోట శ్రీనివాస్ రావురావు రమేష్తనికెళ్ళ భరణి
సంగీతం : S.S. తమన్
డైరెక్టర్ : హరీష్ శంకర్
నిర్మాత : దిల్ రాజు
జూనియర్ ఎన్టీఆర్ కరియర్ లోనే కలర్ ఫుల్ గా ఎంటర్ టైనర్ గా నిలిచింది రామయ్యా వస్తావయ్య. శృతి హాసన్సమంతా లు హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ లో లవర్ బాయ్ లాజాలీగా ఉండే కుర్రాడిలా ఉండే NTR, ఇంటర్వెల్ బ్యాంగ్ తరవాత తన విశ్వరూపం చూపిస్తాడు. ఎక్స్ పెక్ట్ చేయని ట్విస్టు లతో సినిమాని చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడు హరీష్ శంకర్. S.S. తమన్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

==============================================================================

నన్ను దోచుకుందువటే
నటీనటులు : సుధీర్ బాబునభా నతేష్
ఇతర నటీనటులు : నాజర్రాజశేఖర్వైవా హర్షచలపతి రావుజీవబాబ్లో పృథ్విరాజ్వర్షిణి సుందరాజన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : B. అజనీష్ లోక్ నాథ్
డైరెక్టర్ : R.S. నాయుడు
ప్రొడ్యూసర్ : సుధీర్ బాబు
రిలీజ్ డేట్ : 20 సెప్టెంబర్ 2018
కార్తీక్ (సుధీర్ బాబు) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పెద్ద పొజిషన్ లో ఉంటాడు. ఉద్యోగులందరికీ అతడంటే హడల్. టార్గెట్లు పెట్టి హింసిస్తుంటాడు. అతడికి పనే ప్రపంచం. ఫ్యామిలీని కూడా పట్టించుకోని పనిరాక్షసుడు. ఎలాగైనా అమెరికా వెళ్లి డబ్బు సంపాదించిఆస్తులు పోగొట్టుకున్న తండ్రిని సుఖపెట్టాలనేది కార్తీక్ టార్గెట్.
ఇలాంటి వ్యక్తిని తన అల్లుడ్ని చేసుకోవాలని చూస్తాడు అతడి మేనమామ (రవివర్మ). కానీ తను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని కార్తీక్ తో చెబుతుంది అతడి మరదలు. మరదల్ని సేవ్ చేయడం కోసం తను సిరి అనే వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని తండ్రిమేనమామ దగ్గర అబద్ధం చెబుతాడు కార్తీక్.
ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం చదువుకుంటూషార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తున్న మేఘన (నబా నటేష్) హెల్ప్ తీసుకుంటాడు. సిరి పేరుతో కార్తీక్ తండ్రికి (నాజర్) దగ్గరైన అల్లరి పిల్ల మేఘన నిజంగానే వాళ్లతో కలిసిపోతుంది. ఒక దశలో కార్తీక్ ను కూడా ప్రేమిస్తుంది. కానీ కార్తీక్ మాత్రం ఆమె ప్రేమను అర్థం చేసుకోడు. చివరికి మేఘన ప్రేమను కార్తీక్ ఎలా గుర్తిస్తాడుతండ్రిని ఎలా మెప్పించాడుతను కోరుకున్న అమెరికా కలను నెరవేర్చుకున్నాడా లేదా అనేది క్లుప్తంగా ఈ సినిమా స్టోరీ.