మహేష్ నెక్స్ట్... లిస్ట్ అదే ?

Sunday,June 02,2019 - 03:20 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ స్పీడ్ పెంచేశాడు. సినిమా అవ్వగానే మరో సినిమా సెట్ చేసుకుంటూ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు. ప్రస్తుతం అనీల్ రావిపూడి తో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేయబోతున్న మహేష్ నెక్ట్స్ పరశురాంతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. ఈ రెండే కాదు మరో రెండు సినిమాలను కూడా ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నాడట మహేష్.

పరశురాం సినిమా తర్వాత మహేష్ రాజమౌళితో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా మహేష్ సినిమానే అంటున్నారు. ఇప్పటికే మహేష్ కోసం స్టోరీ రెడీ చేసే పనిలో ఉన్నారట విజయేంద్ర ప్రసాద్.

ఇక రాజమౌళి సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడని సమాచారం. ఇప్పటికే వీరిద్దరి మధ్య స్టోరీ డిస్కర్షన్స్ జరుగుతున్నాయని టాక్. అల్లు అర్జున్ తర్వాత మెగాస్టార్ తో సినిమా చేస్తాడు త్రివిక్రమ్.. ఆ సినిమాల తర్వాత త్రివిక్రమ్ మహేష్ కే ఫిక్సయ్యాడంటున్నారు.

ఇలా ముగ్గురు దర్శకులతో మహేష్ నెక్స్ట్ సినిమాలు కన్ఫర్మ్ చేసుకున్నాడనే వార్త చక్కర్లు కొడుతుంది. ఇదే నిజమైతే మహేష్ అభిమానులకి ఇక పండగే.