అడివి శేషు నుంచి మరో థ్రిల్లర్

Monday,June 03,2019 - 10:44 by Z_CLU

క్షణం, గూఢచారి సినిమాలతో ఆ జానర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు అడివి శేష్. అన్నీ తానై సినిమాలు తీసే ఈ హీరో ఇప్పుడు సైలెంట్ గా మరో మూవీ రెడీ చేశాడు. దాని పేరు ఎవరు. ఈరోజు ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు.

క్షణం తర్వాత పీవీపీ, అడివిశేష్ కాంబోలో తెరకెక్కిన సినిమా ఇది. ఈ మూవీ షూటింగ్ ను సైలెంట్ గా పూర్తిచేశారు. ఇప్పుడు ప్రచారాన్ని ప్రారంభించారు. ఆగస్ట్ 23న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

వెంకట్ రామ్ జీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సినిమాలో శేష్ సరసన రెజీనా హీరోయిన్ గా నటించింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.