జీ సినిమాలు ( 29th ఏప్రిల్ )

Saturday,April 28,2018 - 10:29 by Z_CLU

లక్కున్నోడు

నటీనటులు : విష్ణు మంచు, హన్సిక మోత్వాని

ఇతర నటీనటులు : రఘుబాబు, జయప్రకాష్, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ లక్కరాజు

డైరెక్టర్ : రాజ కిరణ్

ప్రొడ్యూసర్ : M.V.V. సత్య నారాయణ

రిలీజ్ డేట్ : జనవరి 26, 2017

చిన్నతనం నుంచి లక్ వెంట తెచ్చి అంతలోనే లక్ ను దూరం చేసే లక్కీ(విష్ణు) ని అన్ లక్కీ గా భావించి దూరం పెడతాడు లక్కీ తండ్రి భక్త వత్సల. ఇక ఉద్యోగ అవకాశం కోసం హైదరాబాద్ వచ్చిన లక్కీ కి పాజిటీవ్ గా ఆలోచించే పద్మ(హన్సిక ) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే పద్మ ను చూసి ప్రేమలో పడిన లక్కీ, పద్మ ను ఎలా దక్కించుకున్నాడు? ఈ క్రమంలో తన అన్ లక్ కి కారణమైన జె.కె(ఎం.వి.వి.సత్యనారాయణ)ను ఎలా ఎదుర్కున్నాడు? చివరిగా 25 ఏళ్ళు దూరమైన తన తండ్రికి  మళ్ళీ ఎలా దగ్గరయ్యాడు? అనేది సినిమా కథాంశం.

==============================================================================

కొత్తజంట

నటీనటులు :అల్లు శిరీష్ , రెజీనా

ఇతర నటీనటులు : మధు నందన్, సప్తగిరి, మధురిమ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జె.బి

డైరెక్టర్ : మారుతి

ప్రొడ్యూసర్ : బన్నీ వాస్

రిలీజ్ డేట్ : మే 1 , 2014

అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘కొత్త జంట’ సందర్భం లో కలిసిన ఓ ఇద్దరు టి.వి. ప్రోగ్రాం ద్వారా ఎలా పరిచయం అయ్యి ప్రేమలో పడ్డారు అనే కధాంశం తో దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం లో అల్లు శిరీష్, రెజీనా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ప్రోగ్రాం కామెడీ, మ్యూజిక్ హైలెట్స్.

==============================================================================

శకుని

నటీనటులు : కార్తీ, ప్రణీత

ఇతర నటీనటులు : సంతానం, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, నాజర్, రాధిక శరత్ కుమార్, రోజా, కిరణ్ రాథోడ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : శంకర్ దయాళ్

ప్రొడ్యూసర్ : S. R. ప్రభు

రిలీజ్ డేట్ : 22 జూన్ 2012

కార్తీ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘శకుని’. రొటీన్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా కార్తీ కరియర్ లోనే వెరీ స్పెషల్ సినిమా. సంతానం పండించే కామెడీ తో, బోర్ కొట్టకుండా సినిమాలో ఎప్పటికప్పుడు వచ్చే ట్విస్ట్ లే ఈ సినిమాకి హైలెట్. ఈ సినిమాలో ప్రణీత హీరోయిన్ గా నటించింది.

==============================================================================

బాలు

హీరో హీరోయిన్లు : పవన్ కళ్యాణ్, శ్రియ శరన్, నేహ ఒబెరాయ్

ఇతర నటీనటులు : గుల్షన్, సుమన్, జయసుధ, తనికెళ్ళ భరణి, సునీల్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ తదితరులు 

సంగీతం : మణిశర్మ

దర్శకత్వం : కరుణాకరన్

నిర్మాత : అశ్విని దత్

విడుదల తేది : 6 జనవరి  2015

తొలి ప్రేమ తర్వాత  పవన్ కళ్యాణ్ -కరుణాకరన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘బాలు‘. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ను ఓ కొత్త కోణంలో ఆవిష్కరించింది. అటు చలాకీ కుర్రాడిగా ఎంటర్టైన్ చేస్తూనే మరో వైపు యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టేసాడు పవర్ స్టార్. మణిశర్మ అందించిన పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్.

==============================================================================

అవును 2

నటీనటులు : పూర్ణ, హర్షవర్ధన్ రాణే

ఇతర నటీనటులు : రవి బాబు, సంజన గల్రాని, నిఖిత తుక్రాల్, రవి వర్మ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 3 ఏప్రిల్ 2015

రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అవును సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది అవును 2. సినిమా కూడా రవిబాబు మార్క్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. హీరోయిన్ పూర్ణ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.