రవి తేజ నెక్స్ట్ సినిమాలివే....

Sunday,April 29,2018 - 10:07 by Z_CLU

‘నేలటిక్కెట్టు’ సినిమాకు సంబంధించి జెట్ స్పీడ్ లో షూటింగ్ ఫినిష్ చేసిన మాస్ మహారాజ్ రవితేజ నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టేసాడు. ప్రస్తుతం శ్రీను వైట్ల డైరెక్షన్ లో ‘అమర్ అక్బర్ అంటోనీ’ సినిమా చేస్తున్న రవితేజ నెక్స్ట్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాలో మరోసారి పవర్ ఫుల్ పోలిసాఫీసర్ గా కనిపించబోతున్నాడు రవితేజ. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాతో పాటే మరో డైరెక్టర్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. డిఫరెంట్ మూవీస్ తో డైరెక్టర్ గా మంచి గుర్తింపు అందుకున్న వి.ఐ.ఆనంద్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను ‘నేలటిక్కెట్టు’ నిర్మాతా రామ్ తాళ్ళూరి బ్యానర్ లోనే చేస్తాడని సమాచారం. మరి ప్రెజెంట్ శ్రీను వైట్ల సినిమా తర్వాత మాస్ మహారాజ్ ఈ రెండిట్లో  ముందుగా ఏది సెట్స్ పైకి తీసుకోస్తాడో చూడాలి.