నాగార్జున – నాని మల్టీస్టారర్ లో స్పెషల్ ఎట్రాక్షన్

Saturday,April 28,2018 - 07:26 by Z_CLU

మే 2 నుండి నాని – నాగార్జున ల మల్టీస్టారర్ నెక్స్ట్ షెడ్యూల్ బిగిన్ కానుంది. అయితే ఈ షెడ్యూల్ లో సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ సీన్స్ ని ప్లాన్ చేసుకున్న సినిమా యూనిట్, ఈ సినిమా కోసం కోటి రూపాయలతో కాలనీ సెట్ ని నిర్మించారట. ఈ కాలనీలోనే నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకోనున్నారు ఫిలిమ్ మేకర్స్.

దాదాపు కొన్ని నెలలుగా ఈ సెట్ ని నిర్మిస్తున్న ఫిలిమ్ మేకర్స్ రీసెంట్ గా ఈ పనులకు ప్యాకప్ చెప్పడంతో ఈ కాలనీ సెట్ ప్రస్తుతం రెడీ షూట్ మోడ్ లో ఉంది. ఈ సినిమా ఎగ్జాక్ట్ స్టోరీలైన్ అయితే ప్రస్తుతానికి రివీల్ కాలేదు కానీ, కంప్లీట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది ఈ సినిమా. ఈ సినిమాలో ఈ కాలనీ సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తుంది.

రష్మిక మండన్న, ఆకాంక్ష సింగ్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. T. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ కంపోజర్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.