'సైరా'లో అమితాబ్ రోల్ అదేనా ?

Sunday,August 27,2017 - 02:40 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా ‘సైరా నర్సింహా రెడ్డి’ ప్రెజెంట్ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది.. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా మోషన్ పోస్టర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసి భారీ అంచనాలు నెలకొల్పిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ తో పాటు, విజయ్ సేతుపతి , జగపతి బాబు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తుండడంతో ఈ సినిమాకు భారీ హైప్ వచ్చింది.

అయితే ఈ సినిమాలో అమితాబ్ ఏ రోల్ లో కనిపించబోతున్నాడనేది ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది. చిరు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డిగా నటించనున్న ఈ సినిమాలో చిరు కి శిక్షణ ఇచ్చే గురువుగా అమితాబ్ కనిపిస్తాడనే వార్త వినిపిస్తుంది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే . కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటూ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది.