జీ సినిమాలు ( 27th డిసెంబర్ )

Tuesday,December 26,2017 - 10:06 by Z_CLU

జాన్ అప్పారావ్ 40+

నటీనటులు : కృష్ణ భగవాన్, సిమ్రాన్

ఇతర నటీనటులు : ఆలీ, కొండవలస లక్ష్మణ రావు, సాయాజీ షిండే, మెల్కోటే, జయ ప్రకాష్ రెడ్డి, రఘుబాబు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కిరణ్ వారణాసి

డైరెక్టర్ : కూచిపూడి వెంకట్

ప్రొడ్యూసర్ : కూచిపూడి వెంకట్

రిలీజ్ డేట్ : 20 మార్చి 2008

కృష్ణ భగవాన్, సిమ్రాన్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిల్లేరియస్ ఎంటర్ టైనర్ జాన్ అప్పారావు 40+. కూచిపూడి వెంకట్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ హైలెట్ గా నిలిచింది.

==============================================================================

 

పాండు రంగడు

నటీనటులు : నందమూరి బాలకృష్ణ, స్నేహ, టాబూ

ఇతర నటీనటులు : అర్చన, మేఘనా నాయుడు, సుహాసిని, మోహన్ బాబు, K.విశ్వనాథ్, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం

మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి

డైరెక్టర్ : రాఘవేంద్ర రావు

నిర్మాత : కృష్ణమోహన రావు

రిలీజ్ డేట్ : 30 మే 2008

1957 లో NTR నటించిన పాండురంగ మహాత్యం సినిమాకి రీమేక్ ఈ “పాండు రంగడు” సినిమా. అన్నమయ్య, శ్రీరామ దాసు లాంటి సినిమాల తర్వాత బాలకృష్ణ తో కూడా ఒక భక్తిరస చిత్రం చేయాలనుకున్న రాఘవేంద్ర రావు ఈ సినిమాని తెరకెక్కించారు. పాండురంగనిగా బాలకృష్ణ నటన, దానికి తోడు కీరవాణి సంగీతం ప్రతీది సినిమాకు ప్రత్యేక ఆకర్షణే. బాలయ్య సరసన స్నేహ, టాబూ హీరోయిన్ లుగా నటించారు.

==============================================================================

 

కూలీ నం 1

నటీనటులు : వెంకటేష్, టాబూ

ఇతర నటీనటులు : రావు గోపాల్ రావు

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. సురేష్

రిలీజ్ డేట్ : 12 జూన్ 1991

వెంకటేష్ హీరోగా K. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన కలర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ కూలీ నం 1. ఒక సాధారణ కూలీ, పొగరుబోతులైన తండ్రీ కూతుళ్ళ అహాన్ని ఎలా నేలకూల్చాడనే ప్రధానాంశంతో తెరకెక్కిందే ఈ సినిమా. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

============================================================================

ఒకే ఒక్కడు

నటీనటులు : అర్జున్, మనీషా కోయిరాలా

ఇతర నటీనటులు : సుష్మితా సేన్, రఘువరన్, వడివేలు, మణివణ్ణన్, విజయ్ కుమార్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : శంకర్

ప్రొడ్యూసర్ : శంకర్, మాదేశ్

రిలీజ్ డేట్ : 7 నవంబర్ 1999

అర్జున్, మనీషా కొయిరాలా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ఒకే ఒక్కడు. ఒక్క రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలనా పగ్గాలను చేపట్టే యువకుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి A.R. రెహ్మాన్ సంగీతం పెద్ద ఎసెట్.

==============================================================================

 

 రెడీ

నటీనటులు : రామ్, జెనీలియా

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, నాజర్, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు,జయప్రకాష్ రెడ్డి, సుప్రీత్, షఫీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : శ్రీను వైట్ల

ప్రొడ్యూసర్ : స్రవంతి రవి కిషోర్

రిలీజ్ డేట్ : 19 జూన్ 2008

రామ్ జెనీలియా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ రెడీ. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. కామెడీ తో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

హింసించే 23 వ రాజు పులికేసి 

నటీనటులు : వడివేలు, నాజర్

ఇతర నటీనటులు : మోనిక,   రాజశ్రీ, నాజర్, శ్రీమాన్, నాగేష్, వెన్నిరాదై మూర్తి, V.S. రాఘవన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సాబేష్ – మురళి

డైరెక్టర్ : శింబు దీవన్

ప్రొడ్యూసర్ : S. శంకర్

రిలీజ్ డేట్ : 8 జూలై 2006

వడివేలు నటించిన అల్టిమేట్ కామెడీ ఎంటర్ టైనర్ 23 వ రాజు పులికేసి. పొత్తిళ్ళలో ఉండగానే విడిపోయిన ఇద్దరు కవల రాజకుమారుల్లో ఒకడు రాజ్యంలోనే ఉంటూ పిరికివాడిలా పెరుగుతాడు. కానీ జనం మాధ్య పెరిగిన రెండోవాడు రాజ మందిరంలో జరుగుతున్న మోసం గుర్తించి, రాజ్యాధికారాన్ని చేతబట్టి దుష్టులు శిక్షించి అప్పటి నుండి రాజ్య బాధ్యతలను స్వీకరిస్తాడు. ఈ సినిమాలో కామెడీ హైలెట్ గా నిలిచింది. శంకర్ ఈ సినిమాని నిర్మించాడు.