V.I. ఆనంద్ డైరెక్షన్ లో అల్లు అర్జున్

Wednesday,December 27,2017 - 11:56 by Z_CLU

V.I. ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఒక్కక్షణం’ ఈ నెల 28 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. అయితే ఈ బజ్ కి తోడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బన్ని ఫ్యాన్స్ లో క్యూరాసిటీ రేజ్ చేస్తుంది.

‘ఒక్కక్షణం’ రిలీజ్ తరవాత V.I. ఆనంద్ అల్లు అర్జున్ సినిమాకి డైరెక్షన్ చేయబోతున్నాడనే న్యూస్, టాలీవుడ్ సరౌండింగ్స్ లో హీట్ ని జెనెరేట్ చేస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్ కి స్టోరీ చెప్పిన V.I. ఆనంద్, బన్ని నుండి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం ‘ఒక్కక్షణం’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న V.I. ఆనంద్ ఒక ఇంటర్వ్యూలో నెక్స్ట్ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉంటుందని చెప్పడం కూడా, ఈ టాక్ కి మరింత బలాన్నిస్తుంది. మరి ఈ టాక్ కన్ఫర్మేషన్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుందా లేకపోతే జస్ట్ టాక్ లా మిగిలిపోతుందా అనే విషయం తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.