జీ సినిమాలు ( 25th ఆగష్టు )

Friday,August 24,2018 - 10:06 by Z_CLU

దోచెయ్

హీరోహీరోయిన్లు – నాగచైతన్య, కృతి సనోన్

ఇతర నటీనటులు – బ్రహ్మానందం, రవిబాబు, పోసాని, సప్తగిరి, ప్రవీణ్

సంగీతం – సన్నీ

దర్శకత్వం – సుధీర్ వర్మ

విడుదల తేదీ – 2015, ఏప్రిల్ 24

స్వామిరారా సినిమాతో అప్పటికే సూపర్ హిట్ అందుకున్న సుధీర్ వర్మకు పిలిచిమరీ ఛాన్స్ ఇచ్చాడు నాగచైతన్య. స్వామిరారా సినిమాతో తన మార్క్ ఏంటో చూపించిన సుధీర్ వర్మ… తన  రెండో ప్రయత్నంగా తీసిన దోచెయ్ సినిమాకు కూడా అదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. మహేష్ సరసన వన్-నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి సనోన్ కు ఇది రెండో సినిమా. అలా వీళ్లందరి కాంబోలో తెరకెక్కిన దోచెయ్ సినిమా కుర్రాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేసింది. సన్నీ సంగీతం అదనపు ఆకర్షణ. క్లయిమాక్స్ కు ముందొచ్చే బ్రహ్మానందం కామెడీ టోటల్ సినిమాకే హైలెట్.

=============================================================================

కూలీ నం 1

నటీనటులు : వెంకటేష్, టాబూ

ఇతర నటీనటులు : రావు గోపాల్ రావు

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : K. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. సురేష్

రిలీజ్ డేట్ : 12 జూన్ 1991

వెంకటేష్ హీరోగా K. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన కలర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ కూలీ నం 1. ఒక సాధారణ కూలీ, పొగరుబోతులైన తండ్రీ కూతుళ్ళ అహాన్ని ఎలా నేలకూల్చాడనే ప్రధానాంశంతో తెరకెక్కిందే ఈ సినిమా. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

==============================================================================

మిరపకాయ్

నటీనటులు : రవితేజ, రిచా గంగోపాధ్యాయ

ఇతర నటీనటులు : సునీల్, దీక్షా సేథ్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, నాగబాబు, స్వాతి రెడ్డి, సంజయ్ స్వరూప్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : హరీష్ శంకర్

ప్రొడ్యూసర్ : రమేష్ పుప్పల

రిలీజ్ డేట్ : 12 జనవరి 2011

రవితేజ ఇంటలిజెన్స్ బ్యూరో ఇన్స్ పెక్టర్ గా నటించిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మిరపకాయ్. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో దీక్షా సేథ్ కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ, యాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

కృష్ణ

నటీనటులు : రవితేజ, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, సునీల్, వేణు మాధవ్, ముకుల్ దేవ్, చంద్ర మోహన్, దండపాణి, కళ్యాణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి

డైరెక్టర్ : V.V.వినాయక్

ప్రొడ్యూసర్స్ : కాశీ విశ్వనాథం, D.V.V. దానయ్య

రిలీజ్ డేట్ : 11 జనవరి 2008

రవితేజ, త్రిష నటించిన కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ కృష్ణ. V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రవితేజ కరియర్ లో హైలెట్ గా నిలిచింది. కాశీ విశ్వనాథం, D.V.V. దానయ్య కలిసి నిర్మించిన ఈ సినిమాకి చక్రి సంగీతం హైలెట్ గా నిలిచింది.

==============================================================================

సుడిగాడు

నటీనటులు : అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆలీ, M.S. నారాయణ, రఘుబాబు, వేణు మాధవ్, చంద్ర మోహన్, చలపతి రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్

డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు

ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ D రెడ్డి

రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012

అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్,  బ్రహ్మానందం కాంబినేషన్ లోని కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.

==============================================================================

పండగ చేస్కో

నటీనటులు : రామ్, రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : సాయికుమార్, సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం, ఆదిత్య మీనన్, రావు రమేష్, పవిత్ర లోకేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్

డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని

ప్రొడ్యూసర్ : రవి కిరీటి

రిలీజ్ డేట్ : 29 మే 2015

రామ్, రకుల్ జంటగా నటించిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పండగ చేస్కో. తన కుటుంబ సభ్యుఅల మధ్య అగాధంలా పేరుకుపోయిన దూరాన్ని హీరో ఎలా తగ్గించాడు..? సమస్యని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ప్రధాన కథాంశం. ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

============================================================================

భేతాళుడు

నటీనటులు విజయ్ ఆంటోనిఅరుంధతి నాయర్

ఇతర నటీనటులు : Y  . G మహేంద్రమీరా కృష్ణన్కిట్టిచారు హాసన్సిద్ధార్థ శంకర్మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ ఆంటోని

డైరెక్టర్ ప్రదీప్ కృష్ణమూర్తి

ప్రొడ్యూసర్ : ఫాతిమా విజయ్ ఆంటోని

రిలీజ్ డేట్ : 1  డిసెంబర్ 2016

 సాఫ్ట్ వేర్ కంపెనీ లో సాఫ్ట్ వేర్ గా పనిచేసే దినేష్(విజయ ఆంటోనీఒక అనాధ గాజీవితాన్ని కొనసాగిస్తున్న ఐశ్వర్య(అరుంధతి నాయర్ను పెళ్లిచేసుకుంటాడుపెళ్ళైన తరువాత దినేష్ కు  భయంకరమైన గొంతు వినపడుతూ వేధిస్తుంది.. గతజన్మ కు సంబంధించినజ్ఞాపకాలు గుర్తుకు రావడంజయలక్ష్మి అనే మహిళ తనను గత జన్మలో చంపిందంటూ ఆగొంతుతో వినబడుతూ ఉంటుందిఇంతకీ  గొంతు ఎవరిదిఐశ్వర్య ను పెళ్లి చేసుకున్నతరువాత దినేష్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడుఅసలు జయలక్ష్మి ఎవరుగతజన్మలోదినేష్ ఎవరుఅనేది సినిమా ప్రధాన కథాంశం.