దేవదాస్ టీజర్ – అదీ సంగతి

Friday,August 24,2018 - 06:14 by Z_CLU

దేవదాస్ టీజర్ రిలీజయింది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ చుట్టూ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయి ఉంది. నాని డాక్టర్ లా, నాగార్జున డాన్ లా కనిపించనున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో 0:50 సెకన్ల టీజర్ చూస్తే తెలిసిపోతుంది.

అసలు నానికి మందు కొట్టాలనిపించేంత ప్రాబ్లమ్ ఏం వచ్చి ఉంటుందా..? అనే క్వశ్చన్ రేజ్ చేస్తుంది ఈ టీజర్. అఫ్ కోర్స్ ఈ వీడియోలో నాగార్జున అడిగే క్వశ్చన్ కూడా అదే. ఈ రోజు రిలీజైన ఈ టీజర్ స్టోరీని రివీల్ చేయకపోయినా, సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ని మాత్రం రేజ్ చేసేస్తుంది. నాని, నాగార్జున ల కాంబినేషన్ సినిమాకి డెఫ్ఫినేట్ గా బిగ్గెస్ట్ ఎసెట్ కానుంది.

సెప్టెంబర్ 27 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రష్మిక మండన్న, ఆకాంక్ష సింగ్ ఈ సినిమాలో హీరోయిన్స్. వైజయంతి ఫిలిమ్స్ బ్యానర్ పై అశ్వినిదత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.