జీ సినిమాలు ( 24th జూన్ )

Friday,June 23,2017 - 10:05 by Z_CLU

సూపర్ పోలీస్

నటీ నటులు : వెంకటేష్, నగ్మా, సౌందర్య

ఇతర నటీనటులు : D. రామా నాయుడు, కోట శ్రీనివాస రావు, జయసుధ, బ్రహ్మానందం, ఆలీ, జయసుధ

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్

డైరెక్టర్ : K. మురళి మోహన్ రావు

ప్రొడ్యూసర్ : D. సురేష్

రిలీజ్ డేట్ : 23 జూన్ 1994

ఇన్స్ పెక్టర్ విజయ్ (వెంకటేష్) నిజాయితీ గల పోలీసాఫీసర్. తన గర్ల్ ఫ్రెండ్ ఒక ఆక్సిడెంట్ లో చనిపోతుంది. అప్పటి నుండి తాగుడుకు బానిస అయిన విజయ్ జర్నలిస్ట్ రేణుక ఇంటిలో అద్దెకు దిగుతాడు అంతలో విజయ్ కి అదే సొసైటీలో బిగ్ షాట్ గా చెలామణి అవుతున్న అబ్బాన్న తో వైరం ఏర్పడుతుంది. తనతో తలపడే ప్రాసెస్ తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది ఆక్సిడెంట్ వల్ల కాదు, అది ప్లాన్డ్ మర్డర్ అని తెలుసుకుంటాడు. తనని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..? తన దగ్గర ఉండిపోయిన సాక్ష్యాలేంటి అనే కోణంలో కథ ముందుకు సాగుతుంది.

==============================================================================

ఒకే ఒక్కడు

నటీనటులు : అర్జున్, మనీషా కోయిరాలా

ఇతర నటీనటులు : సుష్మితా సేన్, రఘువరన్, వడివేలు, మణివణ్ణన్, విజయ్ కుమార్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : శంకర్

ప్రొడ్యూసర్ : శంకర్, మాదేశ్

రిలీజ్ డేట్ : 7 నవంబర్ 1999

అర్జున్, మనీషా కొయిరాలా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ఒకే ఒక్కడు. ఒక్క రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలనా పగ్గాలను చేపట్టే యువకుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి A.R. రెహ్మాన్ సంగీతం పెద్ద ఎసెట్.

==============================================================================

గీతాంజలి

నటీనటులు : అంజలి, శ్రీనివాస్ రెడ్డి

ఇతర నటీనటులు : మధునందన్, హర్షవర్ధన్ రాణే, బ్రహ్మానందం, ఆలీ, రావు రమేష్, సత్యం రాజేష్, శంకర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ లక్కరాజు

డైరెక్టర్ : రాజ్ కిరణ్

ప్రొడ్యూసర్ : కోన వెంకట్

రిలీజ్ డేట్ : 8 ఆగష్టు 2014

అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గీతాంజలి. ఈ సినిమాలో అంజలి డ్యూయల్ రోల్ లో ఎంటర్ టైనర్ చేసింది. ఫ్లాష్ బ్యాక్ లో ఇన్నోసెంట్ అమ్మాయిగా అంజలి నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

=============================================================================

ఓ మై  ఫ్రెండ్

హీరో హీరోయిన్లు – సిద్దార్థ్, శృతిహాసన్

ఇతర నటీనటులు – నవదీప్, హన్సిక,

సంగీతం – రాహుల్ రాజ్

నిర్మాత – దిల్ రాజు

దర్శకత్వం – వేణుశ్రీరాం

విడుదల – 2011, నవంబర్ 11

స్నేహానికి  సరికొత్త అర్థాన్నిస్తూ తెరకెక్కిన ఓ మై ఫ్రెండ్ సినిమాకు చాలా విశేషాలున్నాయి. తెలుగులో  శృతిహాసన్ కు ఇది రెండో సినిమా. అయితే శృతిహాసన్ కంటే ముందే  ఆ క్యారెక్టర్ కోసం సమంతను అనుకున్నారు. అప్పటికే ఏమాయచేశావెతో సక్సెస్ అందుకున్న సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని దిల్ రాజు కూడా అనుకున్నాడు. ఆ తర్వాత అమలాపాల్, నిత్యామీనన్ లాంటి హీరోయిన్లపై కూడా ఫొటోషూట్ చేశారు. ఫైనల్ గా హీరో సిద్ధార్థ్ పట్టుబట్టి మరీ శృతిహాసన్ ను తీసుకున్నాడు. ఈ సినిమాతోనే వేణుశ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కాగా.. ఇదే మూవీతో మలయాళం ఇండస్ట్రీకి చెందిన రాహుల్ రాజ్ సంగీత దర్శకుడిగా కూడా పరిచయం అయ్యాడు. ఆన్ లైన్ లో పైరసీ జరగకుండా నిరోధించే అత్యాధునిక టెక్నాలజీ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయమైంది.

=============================================================================

మిరపకాయ్

నటీనటులు : రవితేజ, రిచా గంగోపాధ్యాయ

ఇతర నటీనటులు : సునీల్, దీక్షా సేథ్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, నాగబాబు, స్వాతి రెడ్డి, సంజయ్ స్వరూప్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : హరీష్ శంకర్

ప్రొడ్యూసర్ : రమేష్ పుప్పల

రిలీజ్ డేట్ : 12 జనవరి 2011

రవితేజ ఇంటలిజెన్స్ బ్యూరో ఇన్స్ పెక్టర్ గా నటించిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మిరపకాయ్. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో దీక్షా సేథ్ కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ, యాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

రాక్షసుడు

నటీనటులు : సూర్య, నయనతార

ఇతర నటీనటులు : ప్రేమ్గీ అమరేన్, ప్రణీత సుభాష్, ప్రతిభాన్, రియాజ్ ఖాన్, సముథిరఖని, శరత్ తదితరులు

మ్యూజిక్  డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : వెంకట్ ప్రభు

ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేల్ రాజా

రిలీజ్ డేట్ : 29  మే 2015

సూర్య కరియర్ లోనే డిఫెరెంట్ సినిమాగా నిలిచింది రాక్షసుడు. సూర్య డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా అటు తమిళం లోను, తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయింది. ఆత్మగా నటించిన సూర్య పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.