జీ సినిమాలు ( 23rd జనవరి )

Monday,January 22,2018 - 10:08 by Z_CLU

బంగారు కోడిపెట్ట

నటీనటులు : నవదీప్, స్వాతి రెడ్డి

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్, సంతోష్, రామ్, లక్ష్మణ్, సంచలన

మ్యూజిక్ డైరెక్టర్ : మహేష్ శంకర్

డైరెక్టర్ : రాజ్ పిప్పళ్ళ

ప్రొడ్యూసర్ : సునీత తాటి

రిలీజ్ డేట్ : 7 మార్చి 2014

నవదీప్, స్వాతి జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ బంగారు కోడిపెట్ట. రాజ్ పిప్పళ్ళ డైరక్షన్ చేసిన ఈ సినిమాకి మహేష్ శంకర్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.

==============================================================================

ఒక ఊరిలో

నటీనటులు : తరుణ్, రాజా, సలోని

ఇతర నటీనటులు : చంద్ర మోహన్, నరేష్, కల్పన, రామరాజు, యమునా, నిరోషా

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : రమేష్ వర్మ

ప్రొడ్యూసర్ : చంటి అడ్డాల

రిలీజ్ డేట్ : 1 జూలై 2005

లవర్ బాయ్ తరుణ్, తెలుగమ్మాయి సలోని జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ఒక ఊరిలో. ఒక అందమైన ఊరిలో మొదలైన ప్రేమకథ ఏ మలుపు తిరిగింది. చివరికి ఏమైంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపించుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

మొగుడు

నటీ నటులు : గోపీచంద్, తాప్సీ పన్ను

ఇతర నటీనటులు : శ్రద్ధా దాస్, రాజేంద్ర ప్రసాద్, రోజా, నరేష్, ఆహుతి ప్రసాద్, వేణు మాధవ్

మ్యూజిక్ డైరెక్టర్ : బాబు శంకర్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి

రిలీజ్ డేట్ : 4 నవంబర్ 2011

కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన మొగుడు  పక్కా రొమాంటి ఎంటర్ టైనర్. ఈ సినిమాలో గోపీచంద్, తాప్సీ జంటగా నటించారు. తండ్రి, అక్కా చెల్లెళ్ళ కోసం భార్యను వదులుకున్న హీరో, తిరిగి తనను తన లైఫ్ లోకి ఎలా తెచ్చుకుంటాడు అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

 

శీనుగాడి లవ్ స్టోరీ

హీరో  హీరోయిన్లు – ఉదయనిథి స్టాలిన్, నయనతార

సంగీతం – హరీష్ జైరాజ్

దర్శకత్వం – ఎస్.ఆర్ ప్రభాకరన్

విడుదల తేదీ – 2015

అప్పటికే ‘ఓకే ఓకే’ సినిమాతో తెలుగులో కూడా పెద్ద హిట్ అందుకున్నాడు ఉదయ్ నిధి స్టాలిన్. ఆ ఉత్సాహంతో 2014లో విడుదలైన తన తమిళ సినిమాను… శీనుగాడి లవ్ స్టోరీ పేరుతో తెలుగులోకి కూడా డబ్ చేసి రిలీజ్ చేశాడు. నయనతార హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాకు తెలుగులో కూడా రీచ్ పెరిగింది. పైగా తెలుగులో ఓకేఓకే హిట్ అవ్వడంతో.. శీనుగాడి లవ్ స్టోరీకి కూడా క్రేజ్ ఏర్పడింది. ప్రభాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు కూడా ఎప్పట్లానే తానే నిర్మాతగా వ్యవహరించాడు ఉదయ్ నిథి స్టాలిన్.

==============================================================================

బ్రదర్ అఫ్ బొమ్మాళి

నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : చిన్ని కృష్ణ

ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి

రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.  కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ  పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

=============================================================================

సికిందర్ 

నటీనటులు : సూర్య, సమంతా రుత్ ప్రభు

ఇతర నటీనటులు : విద్యుత్ జమ్వాల్, సూరి, బ్రహ్మానందం, మనోజ్ బాజ్ పాయ్, దళిప్ తాహిల్, మురళి శర్మ, ఆసిఫ్ బస్రా మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : N. లింగుస్వామి

ప్రొడ్యూసర్ : సిద్ధార్థ్ రాయ్ కపూర్, N. సుభాష్ చంద్రబోస్

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2014

సూర్య హీరోగా నటించిన సికందర్ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్. డ్యూయల్ రోల్ లో నటించిన సూర్య నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. చిన్నప్పుడే తప్పిపోయిన తన అన్నను వెదుక్కుంటూ వచ్చిన తమ్ముడు అప్పటికే తన అన్న సిటీలో పెద్ద డాన్ అని తెలుసుకుని షాక్ కి గురి అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రధాన కథాంశం. ఈ సినిమాలో సూర్య సరసన సమంతా హీరోయిన్ గా నటించింది.