ఆచారి అమెరికా యాత్ర రిలీజ్ డేట్ మారింది

Monday,January 22,2018 - 07:49 by Z_CLU

మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. జనవరి 26 న రిలీజ్ కావాల్సిన ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ రిపబ్లిక్ డే బాక్సాఫీస్ రేస్ నుండి తప్పుకుంటుంది. రీజన్స్ ఇంకా బయటికి రాలేదు కానీ ఆల్మోస్ట్ ప్రమోషన్ ప్రాసెస్ కూడా బిగిన్ చేసిన సినిమా యూనిట్, సడెన్ గా సినిమా పోస్ట్ పోన్ అని అనౌన్స్ చేసింది.

G. నాగేశ్వర రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ జ్యూక్ బాక్స్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాయి. కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం ఫుల్ లెంగ్త్ ఇంట్రెస్టింగ్ రోల్ లో నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ సమ్మర్ లో రిలీజ్ కానుంది.

రీసెంట్ గా రిపబ్లిక్ డే రోజు రిలీజ్ కావాల్సిన అభిమన్యుడు, మనసుకు నచ్చింది కూడా పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఇదే వరసలో ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా పోస్ట్ పోన్ అయింది.