జీ సినిమాలు ( 21st డిసెంబర్ )

Wednesday,December 20,2017 - 10:03 by Z_CLU

ఇదీ సంగతి

నటీనటులు : అబ్బాస్, టాబూ, కోట శ్రీనివాస రావు

మ్యూజిక్ డైరెక్టర్ : జాన్ P. వార్కే

డైరెక్టర్ : చంద్ర సిద్దార్థ్

ప్రొడ్యూసర్ : చంద్ర సిద్ధార్థ్

రిలీజ్ డేట్ : 22 ఫిబ్రవరి 2008

అబ్బాస్, టాబూ జంటగా నటించిన ఇదీ సంగతి పర్ ఫెక్ట్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్. అబ్బాస్ (మూర్తి) ఈ సినిమాలో క్రైం రిపోర్టర్ గా కనిపిస్తే టాబూ (స్వరాజ్యం) ఇందులో అత్యాశ గల హౌజ్ వైఫ్ గా నటించింది. ఒకసారి ట్రేన్ ఆక్సిడెంట్ జరిగిన చోట రిపోర్టింగ్ కి వెళ్ళిన అబ్బాస్, అక్కడ ఒక శవం పక్కన పడి ఉన్న సూట్ కేస్ ని తీసుకుంటాడు. అందులో ప్రధాన మంత్రికి సంబంధించిన కోట్ల ఖరీదైన వజ్రాలు ఉంటాయి. అసలే అత్యాశ పరురాలైన స్వరాజ్యం ఏం చేస్తుంది…? ఆ తరవాత కథ ఏ మలుపు తిరుగుతుంది అన్నదే కథాంశం.

==============================================================================

క్షేత్రం

నటీనటులు : జగపతి బాబు, ప్రియమణి

ఇతర నటీనటులు : శ్యామ్, కోట శ్రీనివాస రావు, ఆదిత్య మీనన్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, చలపతి రావు, బ్రహ్మాజీ తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : T. వేణు గోపాల్

ప్రొడ్యూసర్ : G. గోవింద రాజు

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2011

జగపతి బాబు, ప్రియమణి నటించిన ఫాంటసీ సినిమా క్షేత్రం. లక్ష్మీ నరసింహ స్వామీ విగ్రహాన్ని తన ఊరి గుడిలో ప్రతిష్టింపజేయాలన్న కల కూడా తీరకుండానే, తన కుటుంబ సభ్యుల చేతిలోనే హత్యకు గురవుతాడు. వీర నరసింహ రాయలు. ఆ విషయం తెలియని అతని భార్య లక్ష్మి తన భర్త ఆఖరి కోరికను తాను నెరవేర్చడానికి సిద్ధ పడుతుంది. అప్పుడు తన అసలు తత్వాన్ని బయటపెట్టే రాయలు కుటుంబ సభ్యులు తన భర్తను కూడా చంపింది తామేనని చెప్పి మరీ లక్ష్మిని చంపేస్తారు. ఆ మోసాని తట్టుకోలేని లక్ష్మి, ఇంకో జన్మెత్తైనా సరే, తన భర్త కోరికను తీరుస్తానని శపథం చేసి మరీ ప్రాణాలు విడుస్తుంది. ఆ తరవాత ఏం జరుగుతుంది అనేదే తరువాతి కథాంశం. వీర నరసింహ రాయలు గా జగపతి బాబు నటన ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

గోదావరి

నటీనటులు : సుమంత్, కమలినీ ముఖర్జీ

ఇతర నటీనటులు : నీతూ చంద్ర, C.V.L. నరసింహా రావు, కమల్ కామరాజు, తనికెళ్ళ భరణి, శివ, గంగాధర్ పాండే తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K. M. రాధా కృష్ణన్

డైరెక్టర్ : శేఖర్ కమ్ముల

ప్రొడ్యూసర్ : G.V.G. రాజు

రిలీజ్ డేట్ : 19 మే 2006

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్  టైనర్. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సుమంత్, కమలినీ ముఖర్జీ జంటగా నటించారు. న్యాచురల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రిలీజైన ప్రతి సెంటర్ లోను సూపర్ హిట్ అయింది.

==============================================================================

 

మహానంది 

నటీనటులు – సుమంత్, అనుష్క

ఇతర నటీనటులు – శ్రీహరి, సుమన్, కోటశ్రీనివాసరావు, సాయికిరణ్

సంగీత దర్శకుడు –  కృష్ణమోహన్

దర్శకుడు – సముద్ర

విడుదల తేదీ – 2005, డిసెంబర్ 3

సూపర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన అనుష్క.. తన రెండో ప్రయత్నంగా చేసిన మూవీ మహానంది. సూపర్ తో సక్సెస్ కొట్టిన స్వీటీ… మహానందితో కూడా మరో సక్సెస్ అందుకుంది. ఆర్ ఎస్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీహరి ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. ఈ సినిమా హిందీలో ఏక్ ఔర్ మహాయుధ్… మలయాళంలో ఉల్లాసం పేర్లతో డబ్ అయింది.

==============================================================================

 

మున్నా

నటీనటులు : ప్రభాస్, ఇలియానా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రాహుల్ దేవ్, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, పోసాని కృష్ణ మురళి, వేణు తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : వంశీ పైడిపల్లి

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 2, మే  2007

ప్రభాస్, ఇలియానా జంటగా నటించిన పర్ ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి పీటర్ హెయిన్స్ యాక్షన్, హారిస్ జయరాజ్ సంగీతం హైలెట్ గా నిలిచాయి.

=============================================================================

 

 నా పేరు శివ

నటీనటులు : కార్తీ, కాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : జయప్రకాష్, సూరి, రవి ప్రకాష్, రాజీవన్, విజయ్ సేతుపతి, లక్ష్మీ రామకృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ :  సుసీంతిరన్

ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేళ్ రాజా

రిలీజ్ డేట్ : 20ఆగష్టు 2010

సుసీంతిరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన క్రైం థ్రిల్లర్ నా పేరు శివ.  యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. థ్రిల్లింగ్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.