సూర్య సరసన సాయిపల్లవి

Thursday,December 21,2017 - 10:03 by Z_CLU

మళయాళ ‘ప్రేమమ్’ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన సాయి పల్లవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అయితే ఇప్పటి వరకు ఫీల్ గుడ్ ఎంటర్టైనర్స్ తో ఎట్రాక్ట్ చేసిన  ఈ హీరోయిన్ ఉన్నపళంగా కమర్షియల్ హీరోయిన్స్ లిస్టులో కూడా చేరిపోయింది. సూర్య 36 వ సినిమాలో హీరోయిన్ గా నటించే లక్కీ చాన్స్ కొట్టేసింది సాయి పల్లవి.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో సూర్య సరసన నటించనుంది సాయి పల్లవి. సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉంది. ఈ సినిమాకి S.R. ప్రకాష్ బాబు, S.R. ప్రభు నిర్మాతలు.