రేపు గ్రాండ్ గా రిలీజ్ కానున్న నాని MCA

Wednesday,December 20,2017 - 05:00 by Z_CLU

టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్న నాని MCA రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో సూపర్ ఫామ్ లో ఉన్న నాని, ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మిడిల్ క్లాస్ ఎలిమెంట్స్ తో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

 

ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తే, వదిన మరదులుగా నాని, భూమిక కాంబినేషన్ సినిమాపై ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. దిల్ రాజు ప్రొడ్యూసర్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.