జీ సినిమాలు ( 18th ఏప్రిల్ )

Tuesday,April 17,2018 - 10:03 by Z_CLU

బ్రహ్మిగాడి కథ

హీరో  హీరోయిన్లు –వరుణ్ సందేశ్, అస్మితా సూద్

ఇతర నటీనటులు –పూనమ్ కౌర్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, కృష్ణుడు, నాగినీడు, అలీ

సంగీతం –కోటి

దర్శకత్వం –ఈశ్వర్ రెడ్డి

విడుదల తేదీ –2011, జులై 1

ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్లుగా నవ్వుకోవాలంటే బ్రహ్మిగాడి కథ చూడాల్సిందే. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో అందర్నీ నవ్వించేలా  తెరకెక్కింది బ్రహ్మిగాడి కథ. రాయలసీమ యాసలో జయప్రకాష్ రెడ్డి చెప్పిన డైలాగులు, తన సీనియార్టీ అంతా ఉపయోగించి బ్రహ్మానందం ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్, చేసిన కామెడీ సినిమాకు స్పెషల్  ఎట్రాక్షన్స్. వీటికి తోడు కృష్ణుడు, అలీ  కూడా నవ్విస్తారు. హీరోయిన్ అస్మితా సూద్ ఈ సినిమాతోనే హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.

=============================================================================

అహ నా పెళ్ళంట

నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, రజని

ఇతర నటీనటులు : నూతన ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాళ్ళపల్లి, బ్రహ్మానందం, సుత్తి వీరభద్ర రావు, శుభలేఖ సుధాకర్, విద్యా సాగర్

మ్యూజిక్ డైరెక్టర్ : రమేష్ నాయుడు

డైరెక్టర్ : జంధ్యాల

ప్రొడ్యూసర్ : డి. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 27 నవంబర్ 1987

అహ నా పెళ్ళంట. ఈ సినిమా గురించి తెలుగు వారికి పెద్దగా పరిచయం అవసరం లేదు. 1987 లో జంధ్యాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆల్ టైం సూపర్ హిట్ అనిపించుకుంది. పరమ పిసినారిగా కోట శ్రీనివాస రావు నటన సినిమాకే హైలెట్. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం క్యారెక్టర్స్ సినిమా చూస్తున్నంత సేపు నవ్విస్తూనే ఉంటారు. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో జంధ్యాల తరం స్టార్ట్ అయింది.

==============================================================================

మున్నా

నటీనటులు : ప్రభాస్, ఇలియానా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రాహుల్ దేవ్, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, పోసాని కృష్ణ మురళి, వేణు తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : వంశీ పైడిపల్లి

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 2, మే  2007

ప్రభాస్, ఇలియానా జంటగా నటించిన పర్ ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి పీటర్ హెయిన్స్ యాక్షన్, హారిస్ జయరాజ్ సంగీతం హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

మడత కాజా

నటీనటులు : అల్లరి నరేష్, స్నేహ ఉల్లాల్

ఇతర నటీనటులు : మర్యమ్ మజారియా, ఆశిష్ విద్యార్థి, ఆలీ, సుబ్బరాజు, ధర్మవరpపు సుబ్రహ్మణ్యం, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్

డైరెక్టర్ : సీతారామరాజు దంతులూరి

ప్రొడ్యూసర్ : వేదరాజు టింబర్

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

అల్లరి నరేష్ నటించిన హిల్లేరియస్ ఎంటర్ టైనర్ మడత కాజా. పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేసే ఒక యువకుడు, మాఫియా డాన్ చేస్తున్న ఆకృత్యాలను ఎలా బయటికి లాగాడనే  అంశంతో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమాలో కామెడీ హైలెట్ గా నిలిచింది.

==============================================================================

చిరుత

నటీనటులు : రామ్ చరణ్ తేజనేహా శర్మ

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్ఆశిష్ విద్యార్థిబ్రహ్మానందంఆలీసాయాజీ షిండే, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 28 సెప్టెంబర్ 2007

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ రామ్ చరణ్ లోని పర్ఫామెన్స్ ని స్టామినాని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. దానికి తోడు మణిశర్మ  సంగీతం సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది.  

==============================================================================

 

మగమహారాజు

నటీనటులు : విశాల్, హన్సిక

ఇతర నటీనటులు : ప్రభు, సంతానం, సతీష్, వైభవ్ రెడ్డి, రమ్య కృష్ణన్, ఐశ్వర్య, కిరణ్ రాథోడ్, మధురిమ, మాధవీ లత తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా

డైరెక్టర్ : సుందర్ C.

ప్రొడ్యూసర్ : ఖుష్బూ సుందర్

రిలీజ్ డేట్ : 14 జనవరి 2015

విశాల్, హన్సిక నటించిన లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మగమహారాజు. ఊటీలో పొలిటీషియన్స్ ని ఒక చోట చేరుస్తూ, బిజినెస్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకునే యువకుడి జీవితంలో ఒక అనూహ్య సంఘటన జరుగుతుంది. అదేమిటీ..? ఆ ప్రాబ్లం నుండి ఆ యువకుడు ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో తెరకెక్కిందే మగ మహారాజు. ఈ సినిమాలో ప్రభు నటన సినిమాకే హైలెట్.