రేపే బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ టీజర్ రిలీజ్

Tuesday,April 17,2018 - 06:02 by Z_CLU

శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం. ప్రస్తుతం U.S. లోని ఎగ్జోటిక్ లొకేషన్ లలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యూనిట్, రేపు టీజర్ ని రిలీజ్ చేయనుంది. అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

 ‘నేచర్ ఇజ్ ద విట్నెస్’ అనే ట్యాగ్ లైన్ తో ఇప్పటికే మూవీ లవర్స్ లో ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేయడంలో సక్సీడ్ అయిన ఫిల్మ్ మేకర్స్, రేపు రిలీజ్ కానున్న ఈ టీజర్ తో ‘సాక్ష్యం’ స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేయనున్నారు. ‘జయ జానకి నాయకా’ సినిమాతో మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో మరింత డిఫెరెంట్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది.

 

ఇప్పటి వరకు సినిమా స్టోరీలైన్ ఏంటనేది కూడా బయటికి రాకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న ఫిల్మ్ మేకర్స్, రేపు రిలీజ్ చేస్తున్న ఈ టీజర్ తో టాలీవుడ్ లో మ్యాగ్జిమం ఇంపాక్ట్ క్రియేట్ చేయనున్నారు. జగపతి బాబు, మీనా, శరత్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా మే 11 న గ్రాండ్ గా రిలీజవుతుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాని అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ మ్యూజిక్ కంపోజర్.