జీ సినిమాలు ( 12th జూన్ )

Monday,June 11,2018 - 10:06 by Z_CLU

బ్రమ్మిగాడి కథ

హీరో  హీరోయిన్లు వరుణ్ సందేశ్, అస్మితా సూద్

ఇతర నటీనటులు –పూనమ్ కౌర్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, కృష్ణుడు, నాగినీడు, అలీ

సంగీతం కోటి

దర్శకత్వం –ఈశ్వర్ రెడ్డి

విడుదల తేదీ –2011, జులై 1

ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్లుగా నవ్వుకోవాలంటే బ్రహ్మిగాడి కథ చూడాల్సిందే. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో అందర్నీ నవ్వించేలా  తెరకెక్కింది బ్రహ్మిగాడి కథ. రాయలసీమ యాసలో జయప్రకాష్ రెడ్డి చెప్పిన డైలాగులు, తన సీనియార్టీ అంతా ఉపయోగించి బ్రహ్మానందం ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్, చేసిన కామెడీ సినిమాకు స్పెషల్  ఎట్రాక్షన్స్. వీటికి తోడు కృష్ణుడు, అలీ  కూడా నవ్విస్తారు. హీరోయిన్ అస్మితా సూద్ ఈ సినిమాతోనే హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.

==============================================================================

స్వాగతం

నటీనటులు : జగపతి బాబుభూమిక చావ్లాఅనుష్క శెట్టి

ఇతర నటీనటులు : అర్జున్ధర్మవరపు సుబ్రహ్మణ్యంఆలీసునీల్వేణు మాధవ్మల్లికార్జునరావు, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : R.P. పట్నాయక్

డైరెక్టర్ : దశరథ్

ప్రొడ్యూసర్ : ఆదిత్య రామ్

రిలీజ్ డేట్ : 25 జనవరి 2008

రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా జీవితం విలువలను సున్నితంగా తడుతూ తెరకెక్కినసినిమా’ స్వాగతం’ దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన  ఇమోషనల్ ఎంటర్ టైనర్ లో భూమికనటన హైలెట్ గా నిలుస్తుంది. R.P. పట్నాయక్ మ్యూజిక్  సినిమాకి ప్రాణం.

=============================================================================

బాలు

హీరో హీరోయిన్లు : పవన్ కళ్యాణ్శ్రియ శరన్నేహ ఒబెరాయ్

ఇతర నటీనటులు : గుల్షన్సుమన్జయసుధతనికెళ్ళ భరణిసునీల్బ్రహ్మానందంఎం.ఎస్.నారాయణ తదితరులు 

సంగీతం : మణిశర్మ

దర్శకత్వం : కరుణాకరన్

నిర్మాత అశ్విని దత్

విడుదల తేది : 6 జనవరి  2015

తొలి ప్రేమ తర్వాత  పవన్ కళ్యాణ్ -కరుణాకరన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘బాలు‘. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ను ఓ కొత్త కోణంలో ఆవిష్కరించింది. అటు చలాకీ కుర్రాడిగా ఎంటర్టైన్ చేస్తూనే మరో వైపు యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టేసాడు పవర్ స్టార్. మణిశర్మ అందించిన పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్.

==============================================================================

గ్రీకు వీరుడు

నటీనటులు : నాగార్జున అక్కినేనినయన తార

ఇతర నటీనటులు : మీరా చోప్రా, K. విశ్వనాథ్ఆశిష్ విద్యార్థిబ్రహ్మానందంకోట శ్రీనివాస రావుఆలీ, M.S. నారాయణధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ దశరథ్

ప్రొడ్యూసర్ : D. శివ ప్రసాద్ రెడ్డి

రిలీజ్ డేట్ : 3 మే 2013

దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ గ్రీకు వీరుడు. ఒంటరిగా విదేశాల్లో పెరిగికుటుంబమంటే ఏంటో తెలియని యువకుడిగా నాగార్జున నటన సినిమాకే హైలెట్. నయన తార అసలు నాగార్జున జీవితంలోకి ఎలా అడుగు పెడుతుంది. ఆ తరవాత వారిద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే ప్రధాన కథాంశం. ఈ సినిమాకి S.S. తమన్ సంగీతం అందించాడు.

==============================================================================

అందాల  రాముడు

నటీనటులు : సునీల్ఆర్తి అగర్వాల్

ఇతర నటీనటులు : ఆకాశ్వడివుక్కరసికోట శ్రీనివాస రావుబ్రహ్మానందంధర్మవరపువేణు మాధవ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్

డైరెక్టర్ : P. లక్ష్మి కుమార్

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్పరాస్ జైన్

రిలీజ్ డేట్ : ఆగష్టు 11, 2006

సునీల్ తన కరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా నటించిన చిత్రం అందాల రాముడు. ఈ సినిమా సునీల్ కరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఆర్తి అగర్వాల్ నటన సినిమాకే హైలెట్.

==============================================================================

పోలీస్ స్టోరీ 2

హీరో – సాయికుమార్సన
ఇతర నటీనటులు – రాక్ లైన్ వెంకటేశ్పీజే శర్మశోభరాజ్పొన్నాంబలం
సంగీతం – ఆర్పీ పట్నాయక్
దర్శకత్వం – థ్రిల్లర్ ముంజు
నిర్మాత : G.H. గురుమూర్తి
విడుదల తేదీ – 1996

అప్పటికే సౌత్ లో పెద్ద హిట్ అయిన పోలీస్ స్టోరీకి సీక్వెల్ గా పోలీస్ స్టోరీ-2ను తెరకెక్కించారు. పోలీస్ స్టోరీ సినిమాకు పనిచేసిన టీం అంతా దాదాపుగా ఈ సీక్వెల్ కు కూడా పనిచేశారు. ఇప్పటికీ సాయికుమార్ కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే అగ్ని పాత్ర ఈసినిమాలోనిదే. యాక్షన్ సినిమాలుఅదిరిపోయే మాస్ డైలాగులు కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది.