విజేత టీజర్ రివ్యూ

Tuesday,June 12,2018 - 11:14 by Z_CLU

మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో ముస్తాబయ్యాడు. చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ నటించిన విజేత సినిమా ప్రమోషన్ ఇవాళ్టి నుంచి అఫీషియల్ గా స్టార్ట్ అయింది. సినిమా టీజర్ లాంచ్ చేశారు. ఓ హీరోకు ఎలాంటి సినిమా అయితే లాంఛింగ్ కు పెర్ ఫెక్ట్ గా ఉంటుందో విజేత అలా ఉండబోతోంది.

ఉద్యోగం కోసం ప్రయత్నించే ఓ సగటు కుర్రాడిగా సింపుల్ గా కనిపించాడు కల్యాణ్ దేవ్. టీజర్ లో కల్యాణ్ దేవ్ తో హీరోయిజం చూపించలేదు. సింపుల్ గా ఉండే ఓ పక్కింటి కుర్రాడిలా ప్రజెంట్ చేశాడు దర్శకుడు రాకేష్ శశి. అలా కల్యాణ్ దేవ్ పై మొదటి సినిమాతోనే ఎలాంటి ముద్ర పడకుండా కాంపౌండ్ లో జాగ్రత్తలు తీసుకున్నారు.

మరీ ఎక్కువ అంచనాలు పెంచకుండా, సింపుల్ అండ్ స్వీట్ గా కట్ అయింది విజేత టీజర్. మూవీలో హీరో తండ్రిగా మురళీ శర్మ, హీరోయిన్ గా మాళవిక నాయర్ నటించారు. టీజర్ లో హర్షవర్థన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సెంథిల్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. వారాహి చలనచిత్ర బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మించిన ఈ సినిమాను త్వరలోనే థియేటర్లలోకి తీసుకురానున్నారు.