కాన్సంట్రేషన్ అంతా మెగాస్టార్ స్పీచ్ పైనే...

Monday,June 11,2018 - 07:49 by Z_CLU

రేపు మార్నింగ్ 8: 59 కి మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన విజేత సినిమా టీజర్ రిలీజవుతుంది. అయితే ఈ టీజర్ తో సినిమా ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచనున్న ఫిల్మ్ మేకర్స్ ఈ నెల 24 న గ్రాండ్ గా ఆడియో లాంచ్ చేయనున్నారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా అటెండ్ కానున్నాడు.

ఈ సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఇస్తున్నాడు కళ్యాణ్ దేవ్. ఇప్పటి వరకు రిలీజైన ఈ సినిమా పోస్టర్స్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉండి ఎట్రాక్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ ఈ సినిమా గురించి ఏం చెప్పనున్నాడోనన్న ఆల్రెడీ ఫ్యాన్స్ లో బిగిన్ అయిపోయింది.

 

రాకేశ్ శశి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు.