జీ సినిమాలు ( 11th సెప్టెంబర్ )

Sunday,September 10,2017 - 10:44 by Z_CLU

అమరావతి

నటీనటులు : స్నేహ, భూమిక, తారకరత్న, సింధూర గద్దె, రవి బాబు  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : ఆనంద్ ప్రసాద్

రిలీజ్ డేట్ : 3 డిసెంబర్ 2009

థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచే దర్శకుడు రవి బాబు తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘అమరావతి’. ఈ చిత్రం లో భూమిక, స్నేహ ల నటన,  సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలు, రవి బాబు టేకింగ్, నందమూరి తారక రత్న క్యారెక్టర్ సినిమాకు హైలైట్స్. ఈ సినిమా కోసం తొలి సారిగా విలన్ అవతారమెత్తిన  తారకరత్న ఈ చిత్రం లో నటన కు గాను నంది అవార్డు అందుకున్నారు. ఆధ్యాంతం  సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలతో ఈ సినిమా అలరిస్తుంది.

==============================================================================

బొబ్బిలి రాజా 

హీరో హీరోయిన్లు – వెంకటేశ్, దివ్యభారతి

ఇతర నటీనటులు – వాణిశ్రీ, సత్యనారాయణ, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబుమోహన్, గుమ్మడి

సంగీత దర్శకుడు –  ఇళయరాజా

దర్శకుడు – బి.గోపాల్

విడుదల తేదీ – 1990

ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్ కలగలిసిన ఓ మంచి కథకు, అదిరిపోయే సంగీతం యాడ్ అయితే ఎలా ఉంటుందో అదే బొబ్బిలి రాజా సినిమా. బి.గోపాల్,వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా వెంకీ కెరీర్ లో ఓ తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. అటు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ కు కూడా భారీగా లాభాలు తెచ్చిపెట్టిన మూవీస్ లో ఇది కూడా ఒకటి. అయ్యో..అయ్యో..అయ్యయ్యో అనే సూపర్ హిట్ డైలాగ్ ఈ సినిమాలోనిదే. రీసెంట్ గా బాబు బంగారం సినిమాలో కూడా వెంకీ ఇదే డైలాగ్ ఉపయోగించారు. ఇక ఈ సినిమాలో పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన సంగీతంతో ఇళయరాజా ఈ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లారు. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు అంతే ఫ్రెష్ గా ఉంటాయి. వెంకటేశ్ కెరీర్ లోనే మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమాగా పేరుతెచ్చుకున్న బొబ్బిలిరాజా.. 3 సెంటర్లలో 175 రోజులు ఆడింది. తర్వాత ఇదే మూవీ తమిళ్ లో వాలిబన్, హిందీలో రామ్ పూర్ కా రాజా పేరుతో విడుదలై…  అక్కడ కూడా విజయం సాధించడం కొసమెరుపు.

==============================================================================

పంచాక్షరి

నటీనటులు : అనుష్క శెట్టి, చంద్ర మోహన్

ఇతర నటీనటులు : నాజర్, ప్రదీప్ రావత్, రవి ప్రకాష్, బ్రహ్మానందం, దివ్యవాణి, తెలంగాణ శకుంతల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చిన్నా

డైరెక్టర్ : V. సముద్ర

ప్రొడ్యూసర్ : బొమ్మదేవర రామ చంద్రరావు

రిలీజ్ డేట్ : 11 జూన్ 2010

హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ పంచాక్షరి. దుర్గామాత గుడిలో పుట్టిన పంచాక్షరిని ఊళ్లూ వాళ్ళు దుర్గాదేవిలా ట్రీట్ చేస్తుంటారు. కానీ ఒక మహా పర్వదినాన పంచాక్షరి గుడిలో నిప్పుకు ఆహుతై పోతుంది. దాంతో దుర్గమ్మ వారే పంచాక్షరి ప్రాణాలు ఆహుతి చేశారు అనే భ్రమలో ఉంటారు ఊరి జనం. కానీ నిజం తరవాత బయటికి వస్తుంది, నిజానికి పంచాక్షరిని చంపింది ఎవరు..? ఆ తరవాత ఏం జరిగింది అనేదే ప్రధాన కథాంశం.

==============================================================================

క్షేత్రం

నటీనటులు : జగపతి బాబు, ప్రియమణి

ఇతర నటీనటులు : శ్యామ్, కోట శ్రీనివాస రావు, ఆదిత్య మీనన్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, చలపతి రావు, బ్రహ్మాజీ తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : T. వేణు గోపాల్

ప్రొడ్యూసర్ : G. గోవింద రాజు

రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2011

జగపతి బాబు, ప్రియమణి నటించిన ఫాంటసీ సినిమా క్షేత్రం. లక్ష్మీ నరసింహ స్వామీ విగ్రహాన్ని తన ఊరి గుడిలో ప్రతిష్టింపజేయాలన్న కల కూడా తీరకుండానే, తన కుటుంబ సభ్యుల చేతిలోనే హత్యకు గురవుతాడు. వీర నరసింహ రాయలు. ఆ విషయం తెలియని అతని భార్య లక్ష్మి తన భర్త ఆఖరి కోరికను తాను నెరవేర్చడానికి సిద్ధ పడుతుంది. అప్పుడు తన అసలు తత్వాన్ని బయటపెట్టే రాయలు కుటుంబ సభ్యులు తన భర్తను కూడా చంపింది తామేనని చెప్పి మరీ లక్ష్మిని చంపేస్తారు. ఆ మోసాని తట్టుకోలేని లక్ష్మి, ఇంకో జన్మెత్తైనా సరే, తన భర్త కోరికను తీరుస్తానని శపథం చేసి మరీ ప్రాణాలు విడుస్తుంది. ఆ తరవాత ఏం జరుగుతుంది అనేదే తరువాతి కథాంశం. వీర నరసింహ రాయలు గా జగపతి బాబు నటన ఈ సినిమాకి హైలెట్.

=============================================================================

 

మడత కాజా

నటీనటులు : అల్లరి నరేష్, స్నేహ ఉల్లాల్

ఇతర నటీనటులు : మర్యమ్ మజారియా, ఆశిష్ విద్యార్థి, ఆలీ, సుబ్బరాజు, ధర్మవరpపు సుబ్రహ్మణ్యం, M.S. నారాయణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్

డైరెక్టర్ : సీతారామరాజు దంతులూరి

ప్రొడ్యూసర్ : వేదరాజు టింబర్

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

అల్లరి నరేష్ నటించిన హిల్లేరియస్ ఎంటర్ టైనర్ మడత కాజా. పోలీస్ ఇన్ఫార్మర్ గా పని చేసే ఒక యువకుడు, మాఫియా డాన్ చేస్తున్న ఆకృత్యాలను ఎలా బయటికి లాగాడనే అనే అంశంతో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమాలో కామెడీ హైలెట్ గా నిలిచింది.

=============================================================================

ఇంద్రుడు

హీరో హీరోయిన్స్ : విశాల్,లక్ష్మి మీనన్

ఇతర నటీనటులు : ఇనియా ,శరణ్య పొన్ వణ్ణం, సుందర్ రాము, జయ ప్రకాష్ తదితరులు

సంగీతం : జి.వి.ప్రకాష్ కుమార్

నిర్మాత : విశాల్. రోన్ని,సిద్దార్థ్

దర్శకత్వం : తిరు

విశాల్- లక్ష్మి మీనన్ జంటగా దర్శకుడు తిరు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇంద్రుడు’. ఈ సినిమాలో ఓ డిసార్డర్ తో భాధ పడే ఓ యువకుడిగా నటించాడు విశాల్. విశాల్ యాక్టింగ్ , లక్ష్మి మీనన్ గ్లామర్, కామెడీ సీన్స్ , యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ లో ట్విస్ట్ ఈ సినిమాకు హైలైట్స్….