జై లవకుశ ట్రయిలర్ కు భారీ రెస్పాన్స్

Monday,September 11,2017 - 11:07 by Z_CLU

ఇన్నాళ్లూ టీజర్స్ తో హల్ చల్ చేసిన జై లవకుశ సినిమా ఇప్పుడు ట్రయిలర్ తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. విడుదలైన 15 గంటల్లో ఈ టీజర్ కు 30లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయంటే.. ఈ ట్రయిలర్ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురుచూశారో అర్థం చేసుకోవచ్చు.

ఎన్టీఆర్ 3 డిఫరెంట్ గెటప్స్ పోషించిన ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేత థామస్ హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు కల్యాణ్ రామ్ నిర్మాత. బాబి దర్శకుడు