మహి. వి. రాఘవ్ ఇంటర్వ్యూ

Tuesday,January 29,2019 - 01:55 by Z_CLU

ఫిబ్రవరి 8 న రిలీజవుతుంది ‘యాత్ర. దివంగత ముఖ్యమంతి YSR రాజకీయ జీవితంలోని ఇంపార్టెంట్ ఫేజ్ ‘పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో, మరెన్నో హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి అంటున్నాడు దర్శకుడు మహి.వి. రాఘవ్. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో మరెన్నో విషయాలు షేర్ చేసుకున్నాడు అవి మీకోసం…

నాకంత సీన్ లేదు…

ఒక మనిషి లైఫ్ ని చదివేసి అవగాహన చేసుకుని, దానిని అద్భుతంగా ప్రెజెంట్ చేసే స్థాయి నాకు వచ్చేసిందని నేననుకోను. YSR గారి బయోపిక్ చేయాలనుకున్నానుకుంటే దాని వెనక రీజన్ ఉంది.

అదీ ఇంపాసిబుల్…

ఇండియా లాంటి దేశంలో ఒక పాలిటీషియన్ గురించి అడిగితే పాజిటివ్ రెస్పాన్స్ రావడం అనేది ఇంపాసిబుల్. నేను YSR గారి విషయంలో విన్నాను. ఎవరూ ఆయన హీరోయిజం గురించి మాట్లాడరు. చాలా రెగ్యులర్ విషయాలు మాట్లాడతారు, ఆయన పిల్లల చదువు కోసం తీసుకున్న డెసిషన్స్, ఆరోగ్యం గురించి పడ్డ తపన, ఇవే విన్నాను. దాన్ని బట్టి అయన ఒక సామాన్యుడికి ఎంత చేరువయ్యారు అనేది అర్థమయింది.

రాజకీయం లేదు…

‘యాత్ర’ కేవలం YSR గారి ‘పాదయాత్ర’ చుట్టూ తిరిగే సినిమా. ఆయన పాదయాత్రకు ఇన్స్ పైర్ చేసిన సిచ్యువేషన్స్ దగ్గరి నుండి, పాదయాత్రలో ఆయన అనుభవాలు, ప్రజల ఇమోషనల్ సీక్వెన్సెస్ మాత్రమే ఉంటాయి. ఏ మాత్రం కాంట్రవర్సీ ఎలిమెంట్స్ కానీ, రాజకీయం కానీ ఉండదు…

అందుకే మమ్ముట్టి గారు…

మమ్ముట్టి గారి పర్ఫామెన్స్ స్కిల్స్ గురించి స్పెషల్ గా మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గతంలో చేసిన కొన్ని బయోపిక్స్ ఆ క్యారెక్టర్స్ కి మరింత లైఫ్ ని తీసుకొచ్చాయి. అందుకే ఈ బయోపిక్ అనుకుంటున్నప్పటి నుండి మమ్ముట్టి గారు తప్ప ఇంకో ఆలోచన లేదు…

మేము అసలు ట్రై చేయలేదు…

సినిమాలో ఎక్కడా కూడా YSR గారిని ఇమ్మిటేట్ చేసే ప్రయత్నం చేయలేదు. మీరు ట్రైలర్ గమనిస్తే 100% యాక్టర్ గా మమ్ముట్టి గారి చరిష్మా చూస్తారు. కథ మాత్రం YSR గారిదే.

మమ్ముట్టి గారి ప్రశ్న…

మమ్ముట్టి గారిని సంప్రదించినప్పుడు ఆయన ఒకే ఒక ప్రశ్న వేశారు. ‘నేనే ఎందుకు..?’ దానికి నేనిచ్చిన సమాధానం ‘దళపతి’ సినిమా…

అదీ మమ్ముట్టి గారు…

ఆ సినిమాలోని ఒక సీన్ లో రజినీకాంత్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ అగ్రెసివ్ గా డైలాగ్స్ చెప్పాక, చివరిలో మమ్ముట్టి గారు జస్ట్ ‘కుదరదు’ అంటారు. జస్ట్ ఆ ఒక్కమాట ఆ సీన్ ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. అలా జరిగిందంటే కేవలం అదీ ఆయన ఆరా. సాధారణ నటుల వల్ల అది పాసిబుల్ కాదు.

ఆయన నడిచి వెళ్తుంటే…

సినిమాలో డైలాగ్స్, సీన్స్  మాత్రమే కాదు. ‘యాత్ర’ లాంటి సినిమాలో ఒక వ్యక్తి నడిచి వెళ్తుంటేనే లీడర్ అనే ఫీల్ జెనెరేట్ అవ్వాలి. అందుకే నాకు మమ్ముట్టి గారు తప్ప, ఇంకో ఆప్షన్ కనబడలేదు.

నాకు పెద్దగా కష్టమనిపించలేదు…

గతంలో చేసిన సినిమాలో సెట్స్ లో చేశా. ఈ సినిమా మాత్రం భారీ జనం మధ్య చేయాల్సి వచ్చింది. అయినా నాకు పెద్దగా కష్టమనిపించలేదు. అద్భుతమైన టీమ్ పని చేసింది ఈ సినిమాకు. దాంతో అవలీలగా సినిమాను అనుకున్నట్టుగా కంప్లీట్ చేయగలిగాం.

నాకు అనవసరమనిపించింది…           

YSR గారిని హీరోగా ప్రెజెంట్ చేయడానికి నాకు ఇంకొకరిని చిన్నగా చూపించాల్సిన అవసరం రాలేదు. దాని వల్ల అయన రాజకీయ ప్రత్యర్థులపై ఫోకస్ చేయాల్సిన అవసరమే రాలేదు.

నెక్స్ట్ సినిమా…

ఈ సినిమా తరవాతే నిర్ణయిస్తా. ఒక రూపాయి పెట్టాము అంటే, మళ్ళీ వెనక్కి ఎంత రాబట్టుకోగలిగాం అనేదాన్ని బట్టే, నెక్స్ట్ సినిమా స్థాయి ఉంటుంది. అందుకే ‘యాత్ర’ రిలీజయ్యాకే నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తా.