‘NTR’ ఆడియో లాంచ్ కి భారీ స్థాయిలో స్టార్స్

Thursday,December 20,2018 - 07:06 by Z_CLU

NTR బయోపిక్ పై ఎంత క్యూరియాసిటీ క్రియేట్ ఉందో దానికి తగ్గట్టుగానే భారీ స్థాయిలో ఆడియో లాంచ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కి యంగ్ టైగర్ NTR కూడా వస్తున్నాడనడంతో సోషల్ మీడియాలో ఆల్రెడీ బజ్ బిగిన్ అయింది. అయితే NTR తో పాటు నందమూరి ఫ్యామిలీ నుండి మరికొంతమంది ఈ ఈవెంట్ కి వచ్చే అవకాశాలున్నాయి.

సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, మోహన్ బాబు, జమున, గీతాంజలి లాంటి సీనియర్ నటులతో పాటు మరికొంతమంది సీనియర్ స్టార్స్, ఈ ఈవెంట్ కి అటెండ్ అవుతున్నారు. భారీ స్థాయిలో జరగనున్న ఈ ఈవెంట్ లో స్టార్స్, NTR తో తమకున్న రిలేషన్ షిప్ ని షేర్ చేసుకోనున్నారు. ఇదే ఈవెంట్ లో ఈ బయోపిక్ నుండి ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది NTR బయోపిక్. తెలుగు ప్రజల్లో తనకంటూ ఒక గుర్తింపుని ఖ్యాతిని సంపాదించుకున్న NTR బయోపిక్ అనగానే క్రియేట్ అయిన ఎక్స్ పెక్టేషన్స్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యే స్థాయిలో సినిమాని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి ఈ సినిమాకి నిర్మాతలు. కీరవాణి మ్యూజిక్ కంపోజర్.