రాజమౌళి ‘RRR’ లో ఆలియా భట్

Tuesday,January 29,2019 - 03:40 by Z_CLU

అన్ని ఎలిమెంట్స్ లో లాగే కాస్టింగ్ విషయంలో కూడా పర్టికులర్ గా ఉంటాడు రాజమౌళి. అందుకే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘RRR’ సినిమాలో హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు మేకర్స్. అయితే ఈ ప్రాసెస్ లో బాలీవుడ్ సెన్సేషన్ ఆలియాభట్ ని అప్రోచ్ అయిందట టీమ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ఇదే.

ఈ విషయం ఎంతవరకు వాస్తవమన్నది ప్రస్తుతానికి క్లారిటీ అయితే  లేదు కానీ, రీసెంట్ గా కరణ్ జోహార్ ద్వారా ఆలియా భట్ ని అప్రోచ్ అయ్యారట మేకర్స్. మరి దీనికి ఆలియాభట్ రెస్పాన్స్ ఏంటనేదే ఇంకా బయటికి రాలేదు.

 రాజమౌళి సినిమాకి బాలీవుడ్ లో కూడా భారీ క్రేజ్ ఉంది. కాబట్టి మరీ డేట్స్ అర్జెస్ట్ చేసుకోలేక నో అనాల్సిందే కానీ, ఈ అవకాశాన్ని ఏ హీరోయిన్ అంత ఈజీగా వదులుకునే ఛాన్స్ అయితే లేదు. అయితే టాలీవుడ్ లో  ఈ రేంజ్  లో హీట్ జెనెరేట్ చేస్తున్న ఈ న్యూస్ ఎంతవరకు జెన్యూన్ అనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.