మమ్ముట్టి ఇంటర్వ్యూ

Friday,February 01,2019 - 03:12 by Z_CLU

‘యాత్ర’ లో YSR రోల్ లో కనిపించనున్నాడు మమ్ముట్టి. ఫిబ్రవరి 8 న రిలీజవుతున్న ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడాడు ఈ సీనియర్ హీరో. ఆ విషయాలు మీకోసం…

అందుకే కుదరలేదు…

తెలుగులో సినిమా చేయడానికి నిజంగానే చాలా టైమ్ పట్టింది. దానిక్ రీజన్ ఒక్కటే. తగ్గ స్క్రిప్ట్ దొరకపోవడమే. స్క్రిప్ట్ బావుంటే ఎనీ టైమ్ సినిమా చేయడానికి రెడీ.

కొత్త డైరెక్టర్స్..

నా కరియర్ లో దాదాపు 70 మంది డెబ్యూ డైరక్టర్స్ తో పని చేశాను. మహి అప్పటికే 2 సినిమాలు చేసేసి ఉన్నాడు. కొత్త డైరెక్టర్స్ అనగానే వీళ్ళేదో కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తారనే అనిపిస్తుంది.

అవే రీజన్స్…

కంప్లీట్ స్క్రిప్ట్, స్ట్రాంగ్ ప్రొడ్యూసర్, లెజెండ్రీ క్యారెక్టర్. ఒక సినిమా ఓకె చెప్పడానికి ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయనిపించింది కాబట్టే ఈ సినిమా చేశా.

‘యాత్ర అంటే అది కాదు…

YSR గారి పాదయాత్ర అంటే జస్ట్ వాకింగ్ కాదు. జనాల్ని కలవడం, వారి గురించి తెలుసుకోవడం. ఆ జర్నీలో ఆయన అనుభవాలు, ఎమోషనల్ ఫేజ్ మీరీ ‘యాత్ర’లో చూస్తారు.

అసలు ట్రై చేయలేదు…

YSR గారిది కంప్లీట్ గా డిఫెరెంట్ పర్సనాలిటీ. ఒకవేళ నేను ఆయనలా కనిపించే ప్రయత్నం చేసినా కుదిరేది కాదు. అందుకే ఆయన కథ, వ్యక్తిత్వాన్ని మాత్రమే ఎంచుకున్నాం. హావ భావాలు కాదు.

నేనేం చేయలేదు…

నేను ఈ క్యారెక్టర్ ని ప్లే చేయడానికి పెద్దగా ఏమీ కష్టపడలేదు. మహి సినిమాకి కావాల్సినంత రీసర్చ్ చేసి, స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. నేను మహి రాసుకున్నది, చెప్పిందే చేశాను.

అవే నా పోలిటిక్స్…

దాదాపు 30, 40 ఏళ్లుగా సినిమాల్లో ఉన్నాను. సినిమాలే నా ప్రపంచం, అవే నా పోలిటిక్స్…

చూసిన తెలుగు సినిమాలు…

రీసెంట్ గా రామ్ చరణ్ ‘రంగస్థలం’, మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాలు చూశాను. యూట్యూబ్ లో తెలుగు వీడియోస్ కూడా చూస్తుంటాను.

డ్రీమ్ రోల్…

నేను చేసే ప్రతి రోల్ నా డ్రీమ్ రోలే. నాకు తెలిసి ఏ యాక్టర్ అయినా తను కంఫర్ట్ గా ఫీలయ్యే క్యారెక్టర్ ని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కంఫర్ట్ గా ఫీలయ్యేవే డ్రీమ్ రోల్స్ అనే నా ఫీలింగ్.

నన్నెవరూ కలవలేదు…

నన్ను YSR పార్టీ నుండి ఎవరూ కలవలేదు. సినిమా బిగిన్ అయినప్పటి నుండి, నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్ తో టచ్ లో ఉన్నాను అంతే…

పెద్దగా తేడా లేదు…

తెలుగు, తమిళ, మలయాళం అని ఇండస్ట్రీస్ లో పెద్దగా తేడా ఏం లేదు. ఎక్కడైనా మంచి సినిమాలు ఆడుతున్నాయి. ఆడియెన్స్ కూడా కొత్తగా ఆలోచించడం బిగిన్ చేశారు.

మంచి ఫ్రెండ్స్ ఉన్నారు…

నాకు టాలీవుడ్ లో కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. గతంలో సినిమాలన్నీ చెన్నై లోనే జరిగేవి కాబట్టి, అప్పుడూ కలుస్తూనే ఉండేవాళ్ళం. ఇప్పటికీ ఆ పరిచయాలున్నాయి.