విన్నర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్

Wednesday,February 08,2017 - 07:33 by Z_CLU

సాయి ధరం తేజ్ లేటెస్ట్ మూవీ విన్నర్ ఫిబ్రవరి 24 న రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ లోపు సరిగ్గా రిలీజ్ కి 5 రోజులు ముందు ప్రీ-రిలీజ్ ఫంక్షన్  ప్లాన్ చేసింది సినిమా యూనిట్. సాయి ధరం తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాకి తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ ను ఎక్స్ పెక్ట్ చేసినట్టే క్రేజీ గా రిసీవ్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గా రిలీజైన అనసూయ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ లా మారింది.

winner

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో సాంగ్స్ రిలీజ్ తో మెల్లగా విన్నర్ కి స్పేస్ ని క్రియేట్ చేసుకుంది సినిమా యూనిట్. ముందు సాంగ్స్, తరవాత ట్రేలర్, రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఆ తరవాత ప్రమోషన్స్  ఇలా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తోంది.