రాకింగ్ కాంబో మళ్ళీ ఫిక్సయింది
Wednesday,February 08,2017 - 08:13 by Z_CLU
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబో ఎన్టీఆర్, DSP. వీళ్ళిద్దరూ బాబీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సినిమాకి మళ్ళీ చేతులు కలిపారు. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత మరోసారి కలిసిన ఈ కాంబినేషన్.. ఈసారి కూడా రాకింగ్ మ్యూజిక్ తో ఎంటర్ టైన్ చేయాలని ఫిక్సయింది.
మూడు డిఫెరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించనున్న NTR ఈ సినిమా మేకోవర్ కోసమే కాదు మ్యూజిక్ విషయంలోను చాలా సీరియస్ గా ఉన్నాడు. అందుకే తనకు బ్యాక్ టు బ్యాక్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దేవిశ్రీకే మరోసారి ఓటేశాడు.

నాన్నకు ప్రేమతో సినిమాతో దేవిశ్రీ, ఎన్టీఆర్ కలిశారు. అంతకుముందు వీళ్లిద్దరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. నాన్నకు ప్రేమతో పెద్ద హిట్ అవ్వడంతో, జనతా గ్యారేజ్ తో మరో ఛాన్స్ ఇచ్చాడు. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. సెకెండ్ థాట్ లేకుండా తన కొత్త సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసే అవకాశాన్ని కూడా దేవిశ్రీకే అప్పగించాడు యంగ్ టైగర్. ఈనెల 10న ఈ కొత్త సినిమా ప్రారంభం అవుతుంది. 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.