ఘనంగా బిచ్చగాడు హీరోయిన్ పెళ్ళి

Wednesday,February 08,2017 - 06:50 by Z_CLU

బిచ్చగాడు హీరోయిన్ సాట్నా టైటస్ పెళ్ళి ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి ముందే సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారనే పుకాారు ఇరు కుటుంబాల్లో చిన్న డిస్టబెన్స్ ని క్రియేట్ చేసినా, ఎట్టకేలకు పెద్దలు పెళ్ళికి అంగీకరించడంతో ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా పెళ్ళి వేడుక ముగిసింది.

satna-titus-marriage

ఫిబ్రవరి 6 న సాట్నా తను ప్రేమించిన తమిళ డిస్ట్రిబ్యూటర్ కార్తీక్ ని పెళ్ళి చేసుకోవడంతో వీరి ప్రేమ కథ సుఖాంతమయింది. కార్తీక్ డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ సినిమాలతో దూసుకుపోతుంటే, సాట్నా అకౌంట్ లోను 3 సినిమాలు రెడీ ఫర్ రిలీజ్ స్టేజ్ లో ఉన్నాయి.

బిచ్చగాడు సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయిన సాట్నా… ఈ పెళ్ళి న్యూస్ తో మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.