Interview - సాయి ధరం తేజ్ (విరూపాక్ష)

Thursday,April 20,2023 - 04:07 by Z_CLU

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మిస్ట్రిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు తేజ మాటల్లోనే..

రూపం లేని దాంతో  పోరాటం

80, 90వ దశకంలో ఈ కథ ఉంటుంది. వరుసగా జరిగే మిస్టరీ డెత్‌లు ఏంటి? ఊరి మీద చేతబడి చేయించారా? చేస్తే ఎవరు చేసి ఉంటారు? అనే దాని చుట్టూ జరిగే కథ విరూపాక్ష. విరూపాక్ష అంటే రూపం లేని కన్ను. అంటే శివుడి మూడో కన్ను. రూపం లేని దాంతో ఈ సినిమాలో పోరాటం చేస్తాం. అందుకే విరూపాక్ష అని టైటిల్ పెట్టాం.

 

నాకు కొత్త జానర్‌ 

80, 90వ దశకంలోని కథ కాబట్టి.. అప్పట్లో ప్రేమలు ఎలా ఉండేవో తెలుసుకున్నాను. అవన్నీ రీసెర్చ్ చేశాం. సెట్‌లో నాకు అందరూ సపోర్ట్ చేశారు. అన్ని భయాలను ఎదుర్కొని ముందుకు వెళ్లాలనేది నేను నమ్ముతాను. ఈ సినిమాలో కథ కూడా అలానే ఉంటుంది.

 

నేను నోట్స్ రాసుకుంటా 

ఈ సినిమా నాలోని నటుడ్ని పరీక్ష పెట్టినట్టు అనిపించింది. చాలెంజింగ్‌గా అనిపించింది. 80, 90వ దశకంలో ఎలా ఉండేవారు.. ఎలా ప్రవర్తించేవారు.. ఎలా కనిపించాలి? ఇలా ప్రతీ ఒక్క అంశంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను. చిత్రలహరి నుంచి ప్రతీ పాత్రకు సంబంధించి నేను నోట్స్ రాసుకుంటూ వస్తూనే ఉన్నాను.

 

ఎంతో సపోర్టివ్‌గా నిలిచారు

వర్క్ షాప్స్ చేసిన సమయంలో నా పరిస్థితి ఏమీ బాగా లేదు. నేను చేయలేని పరిస్థితుల్లో ఉంటే కూడా అడ్జస్ట్ అయ్యేవారు. మా నిర్మాతలు నాకు ఎంతో సపోర్టివ్‌గా నిలిచారు. ఆ విషయంలో వారికి వందకు వంద మార్కులు ఇవ్వాల్సిందే.

 

బాగా ఆడుతుందని నమ్ముతున్నాను

సుకుమార్ రైటింగ్స్ అంటే ప్రేమ కథలుంటాయి. ఈ సినిమాలోనూ అండర్ లైన్‌గా లవ్ స్టోరీ, ఎమోషన్స్ ఉంటాయి. సినిమా చూశాకా ఆడియెన్స్‌కే అర్థం అవుతంది. నేను ఇప్పుడేం చెప్పలేను. ఇది టిపికల్ జానర్. సుకుమార్ ఇచ్చిన స్క్రీన్ ప్లే సినిమాకు అద్భుతంగా సెట్ అయింది.