సెన్సేషన్ సరే.. సక్సెస్ అవుతుందా..?

Wednesday,February 13,2019 - 06:22 by Z_CLU

ప్రియా ప్రకాష్ వారియర్… జస్ట్ ఒక్క చూపుతో లైమ్ లైట్ లోకి వచ్చేసింది. అప్పటికీ ‘ఒరు అడార్ లవ్’ సినిమా రిలీజ్ కూడా కాలేదు,  జస్ట్  టీజర్ తోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సెన్సేషన్ ప్లాన్డ్ కాదు, నెటిజన్స్ ఎక్స్ పెక్ట్ చేసింది కూడా కాదు.

ఒక్కసారిగా వచ్చి మీదపడ్డ స్టార్ డమ్ ని మ్యానేజ్ చేయడం ప్రియా వారియర్ కి కూడా చాలా కష్టమైందట. ఈ విషయాన్ని రీసెంట్ గా ఒక మీడియా ఇంటరాక్షన్ లో చెప్పుకుంది. అయితే ఉన్నపళంగా క్రియేట్ అయిన ఈ సెన్సేషన్ అంతే స్పీడ్ గా సైలెంట్ అయిపోతుందా..? లేక సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా..?

లవర్స్ డే సినిమా సెట్స్ పైకి వచ్చినప్పుడు కూడా మేకర్స్, ఈ సినిమా తెలుగు రిలీజ్ గురించి అంతగా ప్లాన్ చేసి ఉండరు. ఇప్పుడు కేవలం  ప్రియా చుట్టూ  క్రియేట్ అయి ఉన్న క్రేజ్ వల్లే, ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా  రిలీజ్ కాకపోయినా, ప్రియా వారియర్ ఎవరా అంటే, కుర్రకారు సోషల్ మీడియాలో ప్రియా చేసిన మాయని పేజీలు  పేజీలుగా చెప్పేస్తారు.

అయితే ఇప్పుడు ఉన్న ప్రశ్నల్లా  ఈ  క్రేజ్ ప్రియా వారియర్ కి ఎన్నాళ్ళు నిలబడుతుంది..? అసలు నటిగా ప్రియా వారియర్ ఏ స్థాయిలో మెప్పించగలదు. రీసెంట్ గా ‘లవర్స్ డే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బన్ని అటెండ్ అవ్వడం ఈ సినిమాని ఓ స్థాయిలో రీచ్ అయ్యేలా చేసినా సినిమా కంటెంట్ ని బట్టే సక్సెస్ ఉంటుంది.

గతంలో కూడా బన్ని సరసన ‘నా పేరు సూర్య’ సినిమాలో నటించే బంపర్ ఆఫర్ వదులుకున్న ప్రియా సక్సెస్, ఇకపై తను ఎంచుకునే కథలపై, పర్ఫామెన్స్ లెవెల్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది.