2021 Year End Special : కొత్త హీరోయిన్లు

Tuesday,December 21,2021 - 07:30 by Z_CLU

2021 Year End Special : Tollywood Debut Heroines

ప్రతీ ఏడాది టాలీవుడ్ లోకి కొందరు కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తారు.  ఈ ఏడాది కూడా పది మంది కొత్త హీరోయిన్లు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అందులో కొందరు రిలీజ్ కి ముందే క్రేజ్ తెచ్చుకుంటే మరికొందరు రిలీజ్ తర్వాత గుర్తింపు అందుకున్నారు. మరి ఈ ఇయర్ టాలీవుడ్ లో డెబ్యూ ఇచ్చిన ఆ ముద్దుగుమ్మలెవరో చూద్దాం.

 

కృతి శెట్టి

‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కృతిశెట్టి రిలీజ్ కి ముందే సోషల్ మీడియాలో క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది. సినిమా విడుదలకి ముందే రెండు సినిమాలు కమిటయిన కృతి రిలీజ్ తర్వాత నెక్స్ట్ ఫిలిమ్స్  నంబర్ పెంచేసుకుంది. సినిమాలో తన నటనతో మెస్మరైజ్ చేసింది. యాడ్ ఫిలిమ్స్ చేసిన అనుభవంతో ఫ్యూచర్ ఫిలింలో మెప్పించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో విజయ్ సేతుపతి తో కన్వర్జేషన్ సీన్ లో ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టించుకుంది. ఓవరాల్ గా ఉప్పెన తో బెస్ట్ డెబ్యూ ఇచ్చి భారీ ఆఫర్స్ అందుకొని వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

 Shreeleela-Tollywood-debut-2021-zeecinemalu-special-story-pellisandaD

శ్రీ లీల

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా పరిచయమైతే ఎవరికైనా ఇక తిరుగుండదు. ఈ ఏడాది శ్రీలీల కూడా ఆయన సినిమాతో హీరోయిన్ గా పరిచామైంది. రాఘవేంద్ర రావు దర్శకత్వ  పర్యవేక్షణలో తెరకెక్కిన ‘పెళ్లి సందD’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల రిలీజ్ కి ముందే తన డాన్స్ తో అందంతో ఆకర్షించి కుర్రకారుని థియేటర్స్ కి రప్పించింది. అందుకే సినిమా రిలీజ్ అవ్వకుండానే రవితేజతో హీరోయిన్ గా చేసే అవకాశం కొట్టేసింది.

 

ఫరియా అబ్దుల్లా

తన సొంత పేరు మార్చేసుకొని డెబ్యూ చేసిన సినిమాలో క్యారెక్టర్ పేరుని పెట్టేసుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. ‘జాతిరత్నాలు’ సినిమాతో ఈ ఏడాది హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు రిలీజ్ తర్వాత చిట్టి అంటూ ఆడియన్స్ తో ముద్దుగా పిలిపించుకొని క్రేజ్ అందుకుంది. డెబ్యూ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్న ఫరియా తాజాగా నాగార్జున , చైతు కలిసి నటిస్తున్న ‘బంగార్రాజు’ లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. మరిన్ని ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళుతోంది.

 Amritha-Tollywood-debut-2021-zeecinemalu-special-story-30RojulloPreminchadamEla

అమ్రిత అయ్యర్

నీలి నీలి ఆకాశం అనే పాటతో రిలీజ్ కి ముందే అందరికీ పరిచయమైన అమ్రిత అయ్యర్ కూడా ఈ ఏడాది ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో డెబ్యూ ఇచ్చింది. కాకపోతే రిలీజ్ తర్వాత అమ్మడికి అంతగా క్రేజ్ రాలేదు.  ఆ సినిమాకు సంబంధించి అప్పటికే క్రేజ్ ఉన్న ప్రదీప్ హీరోగా హైలైట్ అయ్యాడు.

 

తాన్య రవిచంద్ర

కార్తికేయ హీరోగా తెరకెక్కిన ‘రాజవిక్రమార్క’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన తాన్య తన నటనతో మంచి మార్కులు అందుకుంది. ఇప్పటికే తమిళ్ లో సినిమాలు చేసిన ఎక్స్ పీరియన్స్ తో మెప్పించి ఆకట్టుకుంది.

 ShivaniRajasekhar-Tollywood-debut-2021-zeecinemalu-special-story-Adbhutham

శివాణి రాజశేఖర్

హీరో డా.రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ కూడా ఈ ఇయర్ బెస్ట్ డెబ్యూ హీరోయిన్ లిస్టు లో చేరింది. నిజానికి శివాని ఎప్పుడో డెబ్యూ చేయాల్సింది. కానీ ఆమె మొదటి సినిమా షూటింగ్ స్టేజిలోనే ఆగిపోవడంతో ఈ ఏడాది తన రెండో సినిమా ‘అద్భుతం’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా OTT లో సూపర్ హిట్ సాధించి శివాని కి మంచి పేరు తీసుకొచ్చింది.

 Drishyaraghunath-Tollywood-debut-2021-zeecinemalu-special-story-ShaadiMubarak

ద్రిశ్య రఘునాథ్

సాగర్ హీరోగా తెరకెక్కిన ‘షాదీ ముబారక్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ద్రిశ్య రఘునాథ్ కూడా ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించి తన యాక్టింగ్ టాలెంట్ తో మెస్మరైజ్ చేసింది. కారులో హీరోతో కలిసి ట్రావెల్ చేస్తూ వచ్చే సన్నివేశాల్లో హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసింది. సినిమా చూసిన ఎవరైనా ఈమె నటన గురించి మాట్లాడకుండా ఉండరు.

 

మీనాక్షి చౌదరి

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో డెబ్యూ ఇచ్చిన మీనాక్షి కూడా ఈ ఇయర్ తనకంటూ లిస్టులో ఓ చోటు అందుకుంది. పాత్రకు తగ్గట్టుగా నటించి తన పెర్ఫార్మెన్స్ తో అలరించింది.

 PriyaPrakashVarrier-Tollywood-debut-2021-zeecinemalu-special-story-Check

ప్రియా ప్రకాష్ వారియర్

ఐయ్ బ్లింగ్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఈ ఏడాదే తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో ప్లేస్ అందుకుంది. నితిన్ హీరోగా వచ్చిన ‘చెక్’ సినిమాతో డెబ్యూ ఇచ్చింది. ఆ వెంటనే ‘ఇష్క్’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు సినిమాలు ఆశించిన ఫలితం అందుకోలేకపోవడంతో బెస్ట్ డెబ్యూ లిస్టు లో టాప్ ప్లేస్ అందుకోలేకపోయింది.

 Kashish-Khan-Tollywood-debut-2021-zeecinemalu-special-story-AnubhavinchuRaja

కాశిష్ ఖాన్

రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ‘అనుభవించు రాజా’ సినిమాతో ఈ ఇయర్ డెబ్యూ ఇచ్చిన కాశిష్ ఖాన్ కూడా మంచి నటన ప్రదర్శించి ఆకట్టుకుంది. త్వరలోనే ‘కిన్నెర సాని’ అనే సినిమాతో ప్రేక్షకులను మరోసారి పలకరించబోతుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics