ప్రియా వారియర్ తెలుగులో క్లిక్ అవుతుందా?

Tuesday,June 25,2019 - 10:02 by Z_CLU

సోషల్ మీడియా సెన్సేషన్… స్టార్ హీరోయిన్ అయిపోతుందనుకున్నారంతా… జస్ట్ అలా కన్ను గీటి యూత్ హార్ట్ ఫేవరేట్ అయిపోయింది. ఆ వేడిలో ఏకంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో అవకాశం కూడా వెదుక్కుంటూ వచ్చింది. కానీ ప్రియా వారియర్ డేట్స్ సర్దుబాటు చేసుకోలేక ఆ అవకాశాన్ని వదులుకుంది. ఆ తరవాతే మళ్ళీ కథ ముందుకు వచ్చింది.

ఒక్కసారిగా క్రియేట్ అయిన సెన్సేషన్ ని నిలబెట్టుకోవడంలో 100% ఫెయిలయింది ప్రియా వారియర్. ఎంత వేగంగా నోటీస్ లోకి వచ్చిందో అంతే వేగంగా పడిపోయింది. ఆ తరవాత తెలుగులో అవకాశం కోసం గట్టిగానే ప్రయత్నించింది. ఎక్కడా అవకాశాలు రాలేదు… కానీ లక్కీగా నితిన్ సినిమాలో అవకాశం దక్కించుకుంది.

ఓ రకంగా చెప్పాలంటే చంద్ర శేఖర్ యేలేటి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రియా వారియర్ సోలో హీరోయిన్ కాదు… ప్రియాకి గట్టి పోటీగా రకుల్ ప్రీత్ కూడా ఉంది. కాకపోతే ప్రియా ప్లే చేయబోతున్న క్యారెక్టర్ జస్ట్ సెకండ్ హీరోయిన్ అనే టైపులో కాకుండా, స్టోరీలో ఇన్వాల్వ్ అయి ఉండబోతుందని తెలుస్తుంది.

మరి ఈ సినిమా ప్రియా వారియర్ ని మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొస్తుందా..? ఒక్కసారిగా క్రేజ్ వచ్చి పడేసరికి ఎలా హ్యాండిల్ చేయాలో తెలీలేదు అని పబ్లిక్ గానే ఒప్పుకున్న ఈ మలయాళీ భామ తెలుగులో క్లిక్ అవుతుందా..? చూడాలి మరీ…