ఎక్కడో తేడా పడింది...

Saturday,July 20,2019 - 01:03 by Z_CLU

ఒకప్పుడు మలయాళీ హీరోయిన్స్ అంటే సిల్వర్ స్క్రీన్ పై ఓ రేంజ్ క్రేజ్ ఉండేది. తెలుగు ఆడియెన్స్ కి ఈజీగా కనెక్ట్ అయిపోయేవారు… హీరోయిన్స్ కొన్నాళ్ళ పాటు ఆ క్రేజ్ ని అలాగే మెయిన్ టైన్ కూడా చేసేవారు.. కానీ చూస్తుంటే టైమ్ మారిందనిపిస్తుంది. ఈ మధ్య మలయాళీ హీరోయిన్స్ సక్సెస్ అన్న పదానికి చాలా దూరంగా ఉండిపోతున్నారు.

 

ప్రియా వారియర్ :  ఈ అమ్మడు సోషల్ మీడియాలో క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ తరవాతే చెప్పడానికి ఏమీ లేదు అన్నట్టుగా తయారయింది. ఎంత స్పీడ్ గా ఆడియెన్స్ కి దగ్గరయిందో అంతే స్పీడ్ గా గ్రాఫ్ పడిపోయింది.  ఇప్పుడు నితిన్ సినిమాలో నటిస్తున్నా ఏ మాత్రం ఇంపాక్ట్  క్రియేట్ చేసుకోగలుగుతుందో చూడాలి.  

 

అనుపమ పరమేశ్వరన్ : అ..ఆ.. తో ఇంట్రడ్యూస్ అయింది. అమ్మాయి మలయాళీ అయినా తెలుగు ఆడియెన్స్ కి పక్కింటమ్మాయి అనిపించేంత దగ్గరయింది. కానీ తన పర్ఫామెన్స్ ని అప్డేట్ చేసుకోకపోవడం… లుక్స్ విషయంలో కూడా వేరియేషన్స్ చూపించకపోవడం… చివరికి అస్తమానం చూస్తున్న అమ్మాయేగా అనిపించే స్థాయికి పడిపోయింది…. అనుపమ ప్రస్తుతం మంఛి అవకాశాల కోసం స్ట్రగుల్ అవుతుంది.

మంజిమా మోహన్ : గౌతమ్ మీనన్ హీరోయిన్ అంటే మాటలా…? నాగ చైతన్య సరసన ‘సాహసమే శ్వాసగా సాగిపో..’ లో కనిపించింది. మళ్ళీ ఆ తరవాత ఇంకో గట్టి అవకాశం పట్టుకోలేకపోయింది. ఓ రకంగా చెప్పాలంటే తెలుగు ఆడియెన్స్ కి ఈ హీరోయిన్ ఎవరో కూడా పెద్దగా గుర్తు లేదు..

అనూ ఇమ్మాన్యువెల్ : నాని ‘మజ్ను’ తో పరిచయమైంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్, బన్ని, లాంటి టాప్ స్టార్స్ సరసన కూడా చాన్స్ కొట్టేసిందో లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. కానీ శైలజా రెడ్డి అల్లుడు తరవాత అనూ ఇమ్మాన్యువెల్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు…

అమలా పాల్ : తెలుగు సినిమాని సీరియస్ గా తీసుకోలేదా..? లేకపోతే అవకాశాలు రాలేదా..? రెండింటిలో ఏది కరెక్టో తెలీదు కానీ అల్టిమేట్ గా టాలీవుడ్ లో టాప్ రేంజ్ కి వెళ్ళగలిగే క్వాలిటీస్ ఉన్న హీరోయిన్ అమలా పాల్. కానీ అవ్వలేదు. రీసెంట్ రిలీజ్ ‘ఆమె’ కూడా తెలుగులో అమలా పాల్ ని మళ్ళీ ఫామ్ లోకి తీసుకురాలేదు.