స్లిమ్ అయింది.. స్పీడ్ పెంచుతుందా?

Wednesday,February 13,2019 - 03:04 by Z_CLU

‘సైజ్ జీరో’ సినిమా కోసం ఉన్నపళంగా బరువు పెరిగింది స్వీటీ. ఎంత బరువు పెరిగిందో అదే స్థాయిలో పర్ఫామ్ చేసి మెస్మరైజ్ చేసింది. అయితే ఆ సినిమా వరకు అది అభినందించాల్సిన విషయమే. కానీ తక్కిన సినిమాల సంగతేంటి..? అదే భారీ ఫిగర్ తో చేయడం కుదరదు కదా… అందుకే మళ్ళీ అదే డెడికేషన్ తో బరువు తగ్గింది అనుష్క. అందుకే ఇప్పుడు ఫోకస్ అనుష్క నెక్స్ట్ సినిమాలపైకి మళ్ళింది.

సాధారణంగా ఓ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా చేయాలంటే ఓ రేంజ్ ఉండాలి, అనుష్కకి ఆ రేంజ్ ఉంది భాగమతి లాంటి భారీ బడ్జెట్ సినిమా చేయగలిగింది. ఇప్పుడు సెట్స్ పైకి  రానున్న  హారర్ థ్రిల్లర్ లో కూడా ఆల్మోస్ట్ లీడ్ రోల్ చేస్తుంది అనుష్క. మరి గ్లామరస్ రోల్స్ సంగతేంటి..? అసలు అనుష్క మనసులో ఏముంది..?

కరియర్ పీక్ లో ఉన్నప్పుడు బరువు పెరిగితే గ్లామరస్ రోల్స్ చేయడం కష్టం అని తెలిసి కూడా రిస్కీ డెసిషన్ తీసుకున్న అనుష్క, ఇప్పుడు జస్ట్ తన మార్క్ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలనే ప్రిఫర్ చేస్తుందా..? లేకపోతే ఎప్పటిలాగే కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా ఎంటర్టైన్ చేస్తుందా..? గతంలోలా స్పీడ్ పెంచుతుందా..?

ఫ్యాన్స్ లో మాత్రం అనుష్క గ్లామర్ కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందుకే స్వీటీ నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ అయిపోతున్నారు. అందుకే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు సరే, ఈ గ్యాప్ తరవాత నెక్స్ట్ ఏ స్టార్ హీరో సరసన అనుష్క కనిపించనుందోనని అంతే క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.