వీకెండ్ రిలీజెస్

Wednesday,August 07,2019 - 01:04 by Z_CLU

ఇప్పటికే మార్కెట్లో గుణ369, రాక్షసుడు, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలున్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా మరో 5 సినిమాలు వచ్చి చేరబోతున్నాయి. ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న సినిమాల్లో మన్మథుడు-2 లాంటి క్రేజీ మూవీ ఉంది.

నాగార్జున, రకుల్ జంటగా నటించిన సినిమా ఇది. రాహుల్ రవీంద్రన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున తన లుక్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఓ విదేశీ చిత్రానికి రీమేక్ గా వస్తున్న మన్మథుడు-2 సినిమాకు చేతన్ భరధ్వాజ్ సంగీతం అందించాడు. ఇప్పటికే ట్రయిలర్ హిట్ అవ్వడం సినిమాకు కలిసొచ్చింది. ఫ్యామిలీతో అంతా కలిసి ఈ
సినిమా చూడొచ్చని అంటున్నాడు నాగ్.

మన్మథుడు-2తో పాటు థియేటర్లలోకి వస్తున్న స్ట్రయిట్ మూవీ కథనం. అనసూయ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా సస్పెన్స్-థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది. రాజేష్ నాదెండ్ల డైరక్ట్ చేసిన ఈ సినిమాలో ఒకటే పాట ఉంటుంది. కథనం చెడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరాల శ్రీనివాస్, ధనరాజ్, వెన్నెల కిషోర్, పృధ్వి, సమీర్ ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమాపై అనసూయ చాలా హోప్స్ పెట్టుకుంది.

మన్మథుడు-2, కథనంతో పాటు 2 డబ్బింగ్ మూవీస్ కూడా రిలీజ్ కు రెడీ అయ్యాయి. విశాల్ హీరోగా నటించిన అయోగ్య సినిమా కూడా వీకెండ్ థియేటర్లలోకి వస్తోంది. తెలుగులో హిట్టయిన టెంపర్ సినిమాకు రీమేక్ ఇది. కాకపోతే క్లైమాక్స్ మొత్తం మార్చామని, చాలా కొత్తగా ఉంటుంది చూడమని కోరుతున్నాడు విశాల్. దీంతో పాటు వస్తున్న మరో డబ్బింగ్ మూవీ కురుక్షేత్రం. వరల్డ్ ఫస్ట్ మైథలాజికల్ 3డీ సినిమాగా వస్తున్న ఈ మూవీలో అర్జున్, అంబరీష్, దర్శన్, సోనూసూద్, నిఖిల్, రవిశంకర్, స్నేహ, హరిప్రియ, ప్రగ్యాజైశ్వాల్ లాంటి తారలు నటించారు.

ఇక ఈ సినిమాల తర్వాత ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి వస్తున్నాడు సంపూర్ణేష్ బాబు. ఇతడు నటించిన కొబ్బరిమట్ట సినిమా 10న థియేటర్లలోకి వస్తోంది. హృదయకాలేయంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంపూ.. ఈసారి కొబ్బరిమట్ట కూడా అదే స్థాయిలో సంచలనం సృష్టిస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు. రూపక్ రొనాల్డ్ సన్ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు సాయిరాజేష్ నిర్మాత.