రేపే రవితేజ మూవీ లాంఛ్

Wednesday,November 13,2019 - 11:58 by Z_CLU

రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధమైంది. రేపు (నవంబర్ 14) ఈ కొత్త సినిమా అఫీషియల్ గా లాంఛ్ అవుతుంది. డాన్ శీను, బలుపు సినిమాల తర్వాత మాస్ రాజా, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న సినిమా ఇది.

రవితేజ ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ కొత్త సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తోంది శృతిహాసన్. వరలక్ష్మీ శరత్ కుమార్, సముత్తరఖని కీలక పాత్రలు పోషించబోతున్నారు. లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్‌ బ్యాన‌ర్‌పై బి.మ‌ధు నిర్మించనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

సినిమా ఓపెనింగ్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అందులో ఇంటెన్స్ బ్యాగ్రౌండ్‌లో ర‌వితేజ పోలీస్ ఆఫీస‌ర్ డ్రెస్‌లో క‌న‌ప‌డుతున్నాడు. ప్రస్తుతం చేస్తున్న డిస్కో రాజా మూవీ కంప్లీట్ అయిన వెంటనే ఈ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.