వీకెండ్ రిలీజ్

Wednesday,May 22,2019 - 01:03 by Z_CLU

ఆల్రెడీ థియేటర్లలో ఉన్న ‘మహర్షి’తో పాటు మరికొన్ని సినిమాలు ఈ వీకెండ్ నుంచి ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నాయి. మహర్షి మినహా, మరో టాప్ స్టార్ సినిమా రిలీజ్ కి లేకపోవడంతో ఈ సినిమాలకు అది కాస్త కలిసొచ్చేలా ఉంది.

లిసా : 3D లో తెరకెక్కిన హారర్ సినిమా. అంజలి లీడ్ రోల్ ప్లే చేసిందీ సినిమాలో. రాజు విశ్వనాథ్ ఈ సినిమాకి డైరెక్టర్. అంజలి గతంలోనూ ఇలాంటి హారర్ సినిమాల్లో నటించి ఇంప్రెస్ చేసింది కాబట్టి, ఈ సినిమాపై కూడా అంచనాలున్నాయి. రిలీజైతే కానీ ‘లిసా’ స్టాండర్డ్స్ తెలీదు.

సీత: తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఇది. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటించారు. అందునా ఇద్దరికీ ఇద్దరు ఇప్పటి వరకు అటెంప్ట్ చేయని డిఫెరెంట్ రోల్స్ ప్లే చేశారు సీతలో. కథే హీరోగా వస్తున్న సినిమా ఇది. మే 24 ఈ సినిమా రిలీజ్ డేట్.

ఎవడు తక్కువ కాదుతమిళ బ్లాక్ బస్టర్ ‘గోలీసోడా’ కి ఇది అఫీషియల్ రీమేక్. నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహదేవ్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. నిర్మాత కూడా లగడపాటి శ్రీధరే. ఈ సినిమాకి రఘు జయ డైరెక్టర్.

ఈ సినిమాలతో పాటు లక్ష్మీ రాయ్ నటించిన నాగకన్య సినిమా కూడా ఈ నెల 24 న రిలీజవుతుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ లు డబ్బింగ్ చెల్లిన ‘అలాద్దీన్’ అనే హాలీవుడ్ సినిమా కూడా అదే రోజున వస్తుంది. మొత్తానికి ఈ వీకెండ్ మ్యాగ్జిమం డిఫెరెంట్ జోనర్స్ లో సినిమాలు రిలీజవుతున్నాయి.