Weekend Release - ఈ వారం 10 సినిమాలు
Thursday,December 09,2021 - 01:42 by Z_CLU
Weekend Release – Lakshya, Gamanam Movies are ready
ఓవైపు అఖండ జోరు కొనసాగుతోంది. అయినప్పటికీ ఈ వారం ఏకంగా 10 సినిమాలు థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి. దీనికి కారణం, బాక్సాఫీస్ వద్ద ఏర్పడిన రద్దీ. అవును.. ఈవారం సినిమా రిలీజ్ చేయకపోతే ఇక మరో నెల రోజుల వరకు బాక్సాఫీస్ ముఖం చూడక్కర్లేదు. వాయిదా వేసుకోవాల్సిందే.
వచ్చే వారం పుష్ప థియేటర్లలోకి వచ్చేస్తోంది. అవతల వారం శ్యామ్ సింగరాయ్ వచ్చేస్తోంది. అక్కడికి వారం గ్యాప్ లో ఆర్ఆర్ఆర్ వస్తోంది. ఇక అక్కడ్నుంచి రాధేశ్యామ్, భీమ్లానాయక్ ఉండనే ఉన్నాయి. సో.. చిన్న సినిమాలకు మిగిలింది ఈ వారం మాత్రమే. అందుకే 10 సినిమాలొస్తున్నాయి. వీటిలో అంచనాలతో వస్తున్న సినిమాలు మాత్రం రెండే.

నాగశౌర్య హీరోగా నటించిన లక్ష్య మూవీ ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది. కంప్లీట్ మేకోవర్ లో శౌర్య చేసిన సినిమా ఇది. యాక్షన్, రొమాన్స్, స్ట్పోర్ట్స్ డ్రామా అన్నీ మిక్స్ చేసి తీసిన సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు శౌర్య. అయితే సినిమాకు ఎంత హిట్ టాక్ వచ్చినా, ఇంతకుముందే చెప్పుకున్నట్టు వారం రోజులు మాత్రమే టైమ్ ఉంది. కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించాడు.

లక్ష్యతో పాటు వస్తున్న మరో మూవీ గమనం. సుజనారావు ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమౌతోంది. ఇళయరాజా సంగీతం, సాయిమాధవ్ బుర్రా మాటలు, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మేజర్ హైలెట్స్. శివ కందుకూరి, శ్రియ, ప్రియాంక జవాల్కర్, నిత్యామీనన్ లాంటి నటీనటులు నటించిన ఈ సినిమాపై కూడా ఓ మోస్తరు అంచనాలున్నాయి.

ఈ రెండు సినిమాలతో పాటు.. మడ్డీ, కఠారి కృష్ణ, బుల్లెట్ సత్యం, నయీం డైరీస్, ప్రియతమా, మనవూరి పాండవులు, ఏడ తానున్నాడో, సుందరాంగుడు లాంటి సినిమాలు రేపు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి.