అభిమన్యుడు డైరక్టర్ కొత్త సినిమా

Wednesday,February 12,2020 - 05:17 by Z_CLU

విశాల్-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన అభిమన్యుడు సినిమా గుర్తుందా? తెలుగులో కూడా హిట్టయిన ఈ సినిమాకు మిత్రన్ దర్శకుడు. ఇప్పుడీ దర్శకుడి నుంచి మరో సినిమా వస్తోంది. పేరు శక్తి.

తమిళ్ లేటెస్ట్ హిట్ `హీరో` సినిమాను `శ‌క్తి` పేరుతో తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. డైనమిక్ స్టార్ శివ కార్తికేయ‌న్ ఇందులో హీరోగా న‌టించాడు. యాక్షన్ కింగ్‌ అర్జున్ కీలక పాత్ర పోషించాడు. బాలీవుడ్ న‌టుడు అభ‌య్ డియోల్‌కి సౌత్ ఇండియాలో తొలి సినిమా ఇదే.

విద్యావ్య‌వ‌స్థ గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన ప్ర‌తిసారీ శంక‌ర్ తెర‌కెక్కించిన జెంటిల్‌మేన్ చిత్రం గుర్తుకొస్తుంది. అందుకు ఏమాత్రం తీసిపోని క‌థ‌తో పి.య‌స్‌.మిత్ర‌న్ డైర‌క్ట్ చేసిన సినిమా`శ‌క్తి`. కేజేఆర్ స్టూడియోస్‌, గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై వస్తున్న ఈ సినిమాకు కోటపాడి రాజేష్ చిత్రానికి. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్ గా నటించింది. త్వరలోనే ఈ సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు.