Weekend Release - అన్నీ క్రేజీ సినిమాలే
Wednesday,October 13,2021 - 12:43 by Z_CLU
ఎప్పట్లా గంపగుత్తగా కాకుండా, ఈసారి కేవలం మూడంటే 3 సినిమాలు మాత్రమే థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే వీటిలో దేన్నీ తక్కువ చేసి చూడ్డానికి వీల్లేదు. ఏ సినిమా ప్రత్యేకత దానిదే. ప్రతి సినిమాపై అంచనాలున్నాయి. ప్రతి సినిమా అందర్నీ ఆకర్షిస్తోంది. ఆ 3 మూవీస్ ఏంటో చూద్దాం రండి..
రేపు థియేటర్లలోకి వస్తోంది మహాసముద్రం సినిమా. శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకుడు. అను ఎమ్మాన్యుయేల్, అదితిరావు హీరోయిన్లుగా నటించారు. ఈ మల్టీస్టారర్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఫస్ట్ లుక్ నుంచి తాజాగా రిలీజైన ట్రయిలర్ వరకు ప్రతి ఫేజ్ లో ఈ సినిమా అంచనాలు పెంచుకుంటూ పోతోంది. దీనికితోడు భారీ ప్రమోషన్ ఈ మూవీకి హెల్ప్ కాబోతోంది.

మహాసముద్రం సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్నాడు సిద్దార్థ్. ఈ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాడు. అటు శర్వానంద్ కు ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. హీరోయిన్లు కూడా మహాసముద్రంపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇక దర్శకుడు అజయ్ భూపతి, ఈ సినిమాతో సెకెండ్ మూవీ సిండ్రోమ్ ను క్రాస్ చేయాల్సి ఉంది. ఇలా ఎన్నో హోప్స్, మరెన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో వస్తోంది మహాసముద్రం.
మహాసముద్రం వచ్చిన 24 గంటలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రాబోతున్నాడు. అఖిల్ నటించిన ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. పూజాహెగ్డే లాంటి స్టార్ హీరోయిన్ ఇందులో ఉండడం, పాటలు, ట్రయిలర్ ఆల్రెడీ హిట్టవ్వడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరక్ట్ చేసిన సినిమా ఇది. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ మ్యూజిక్ అందించాడు. అఖిల్ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా దగ్గరవుతానంటున్నాడు ఈ అక్కినేని హీరో
ఇక మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలకు పోటీగా వస్తోంది పెళ్లిసందD. సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన సినిమా ఇది. నిర్మలా కాన్వెంట్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని పెళ్లి సందDతో ఫుల్ లెంగ్త్ హీరోగా పరిచయమౌతున్నాడు రోషన్. శ్రీలల హీరోయిన్ గా పరిచయమౌతోంది. అయితే ఈ సినిమాలో మెయిన్ ఎట్రాక్షన్స్ ఇవి మాత్రమే కావు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. అవును.. ఈ సినిమాకు దర్శకేంద్రుడు దర్శకత్వ పర్యవేక్షణ చేయడమే కాకుండా.. నటించారు కూడా. అలా తొలిసారి ముఖానికి రంగేసుకొని, సిల్వర్ స్క్రీన్ పైకి వస్తున్నారు రాఘవేంద్రరావు.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics