పవన్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్

Wednesday,February 12,2020 - 03:09 by Z_CLU

రీఎంట్రీలో ఒకేసారి 3 సినిమాలు ఓకే చేశాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వీటిలో దిల్ రాజు బ్యానర్ పై చేస్తున్న పింక్ రీమేక్ కు ఆల్రెడీ టైటిల్ ఫిక్స్ (వకీల్ సాబ్) అయింది. ఇప్పుడు మరో సినిమాకు కూడా టైటిల్ ఫిక్స్ అయినట్టుంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాకు విరూపాక్ష అనే టైటిల్ అనుకుంటున్నారు.

స్వతంత్రానికి పూర్వం జరిగిన ఓ యదార్థ కథకు ఫిక్షన్ జోడించి ఈ సినిమా తీస్తున్నారు. ఇందులో పవన్ రాబిన్ హుడ్ టైపు దొంగగా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర పేరు విరు అని టాక్. అందుకే విరూపాక్ష అనే టైటిల్ బయటకొచ్చింది. యూనిట్ నుంచి మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

ఏఎం రత్నం నిర్మాతగా మెగాసూర్యా ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు.

విరూపాక్ష అనే టైటిల్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయనప్పటికీ.. పవన్ సినిమాకు ఇలాంటి ట్రెడిషనల్ లుక్ వచ్చే టైటిల్ ను పెట్టాలని క్రిష్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు.