Weekend Release - ఏడాది చివర్లో 5 సినిమాలు

Thursday,December 30,2021 - 01:49 by Z_CLU

Weekend Release – Arjuna Phalguna and 1945 Releases on December 31

ఈ వీకెండ్ 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కేవలం ఇది వీకెండ్ సినిమాలు మాత్రమే కాదు, ఇయర్ ఎండ్ సినిమాలు కూడా. వీటిలో రానా, శ్రీవిష్ణు సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ ఏడాదికి ఫినిషింగ్ టచ్ ఇచ్చే సినిమా వీటిలో ఏది?

ఈ ఇయర్ ఇప్పటికే రాజరాజ చోరతో పెద్ద హిట్ అందుకున్నాడు శ్రీవిష్ణు. ఆ సక్సెస్ ను ఇదే ఏడాదిలో కొనసాగించాలనే టార్గెట్ తో అర్జున ఫాల్గుణ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో తేజ మర్ని దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. అమృతా అయ్యర్ హీరోయిన్.

డిసెంబర్ 31న రిలీజ్ అవుతున్న మరో సినిమా 1945. రానా హీరోగా నటించిన పీరియాడిక్ సినిమా ఇది. టైటిల్ కు తగ్గట్టే స్వతంత్రానికి ముందు జరిగిన కథతో తెరకెక్కిన సినిమా ఇది. సత్యశివ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు సి.కల్యాణ్ నిర్మాత. రెజీనా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో.. సత్యరాజ్, నాజర్, ఆర్జే బాలాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు

ఆర్య, రాశీ ఖన్నా, ఆండ్రియా హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా’అరణ్మణై 3′. హారర్ కామెడీగా రూపొందింది. ఇందులో సాక్షి అగర్వాల్, వివేక్, యోగిబాబు, మనోబాల ప్రధాన తారాగణం. సుందర్ సి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అంతఃపురం’ పేరుతో తీసుకొస్తోంది గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌. రెడ్జైంట్ మూవీస్ బ్యానర్లపై ఈ సినిమా వస్తోంది డిసెంబర్ 31న ‘అంతఃపురం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సినిమాలతో పాటు సత్యభామ, విక్రమ్ అనే మరో రెండు సినిమాలు కూడా రేపు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో 2021కు ఫినిషింగ్ టచ్ ఇచ్చే సినిమా ఏదో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఇక జనవరి 1న నూతన సంవత్సరంలో ఆశ, ఇందువదన అనే 2 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.