వీకెండ్ రిలీజ్

Wednesday,August 01,2018 - 12:40 by Z_CLU

ఈ వీకెండ్ ఏకంగా అరడజను సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే వీటిలో ఆసక్తి రేపుతున్నవి మూడంటే మూడు సినిమాలే. ఆ 3 సినిమాల హైలైట్స్ చూద్దాం

హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తీసిన సినిమా చిలసౌ. సుశాంత్ హీరోగా నటించాడు. సినిమా నచ్చి తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టుడియోస్ పై నాగార్జున ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నాడు. అంతేకాదు నాగచైతన్య, సమంత ప్రత్యేకంగా ప్రచారం కూడా కల్పిస్తున్నారు. పెళ్లిచూపుల్లో ఒకర్నొకరు రిజెక్ట్ చేసుకున్న ఓ జంట అనుకోని పరిస్థితుల్లో 24 గంటలు కలిసి ఉండాల్సి వస్తుంది. వాళ్ల మధ్య మళ్లీ లవ్ ఎలా చిగురించిందనేది ఈ సినిమా స్టోరీ.

చిలసౌతో రాహుల్ డైరక్టర్ గా మారితే, గూఢచారి సినిమాతో మరోసారి స్క్రీన్-రైటర్ గా మారాడు అడవి శేషు. అవును.. గూఢచారి సినిమాలో హీరోగా నటించడంతో పాటు దానికి కథ-స్క్రీన్ ప్లే కూడా అందించాడు శేష్. జేమ్స్ బాండ్ సినిమాల టైపులో కంప్లీట్ డిటెక్టివ్ స్టోరీ ఇది. శశికిరణ్ తిక్క డైరక్ట్ చేసిన ఈ సినిమాతో సూపర్ మోడల్ శోభిత ధూలిపాళ తెలుగుతెరకు పరిచయమౌతోంది.

ఈ వీకెండ్ థియేటర్లలోకొస్తున్న మరో మూవీ బ్రాండ్ బాబు. మారుతి ఈ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే-మాటలు అందించాడు. అందుకే మూవీపై అంచనాలు పెరిగాయి. నెక్ట్స్ నువ్వే సినిమా తర్వాత ప్రభాకర్ డైరక్ట్ చేసిన మూవీ ఇదే. కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండడం, ట్రయిలర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అందరి చూపు పడింది.

ఈ వీకెండ్ వస్తున్న సినిమాల్లో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నవి ఇవే. వీటితో పాటు శివకాశీపురం, తరువాత ఎవరు, మన్యం అనే మరో 3 సినిమాలు వస్తున్నప్పటికీ.. వాటిపై పెద్దగా బజ్ లేదు.