నాగశౌర్య కొత్త ప్రయోగం

Wednesday,August 01,2018 - 12:59 by Z_CLU

సినిమాకు హైప్ తీసుకొచ్చే క్రమంలో ఫస్ట్ లుక్ నుంచి ప్రచారం స్టార్ట్ అవుతుంది. తర్వాత లిరికల్ వీడియోస్, ఆ తర్వాత టీజర్లు వస్తుంటాయి. కానీ ఇవన్నీ క్రాస్ చేసి డైరక్ట్ గా ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది నాగశౌర్యది. ఆలోచన వచ్చిన వెంటనే అమలు చేశాడు. నర్తనశాల సినిమాకు సంబంధించి ఏకంగా ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశాడు.

ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న సినిమా ఇది. పైగా ఛలోకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన మహతి స్వరసాగర్ ఈ సినిమాకు కూడా ట్యూన్స్ ఇస్తున్నాడు. ఆ నమ్మకంతోనే ఏకంగా మూడున్నర నిమిషాల వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.

టీజర్, జ్యూక్ బాక్స్ రిలీజ్ చేయకుండా ఇలా డైరక్ట్ గా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయడం ఓ కొత్త ప్రయోగం. ఈ సాంగ్ సూపర్ హిట్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తోంది యూనిట్.

శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమాతో క‌ష్మిర ప‌ర‌దేశి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతోంది. మరో హీరోయిన్ గా యామిని భాస్క‌ర్ నటిస్తోంది. సినిమాను అగ‌ష్టు 30న రిలీజ్ చేయబోతున్నారు.

నటీనటులు
నాగ‌శౌర్య‌, క‌ష్మర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, అజ‌య్‌, శివాజి రాజ‌, సుధ‌, ప్రియ‌, జెమిని సురేష్‌, రాకేట్ రాఘ‌వ‌, స‌త్యం రాజేష్‌, రాఘ‌వ‌, ఉత్తేజ్‌, తిరుప‌తి ప్ర‌కాష్‌, ప‌ద్మ జ‌యంతి, మాధురి త‌దిత‌రులు న‌టించ‌గా..

టెక్నీషియన్స్
క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం.. శ్రీనివాస్ చ‌క్ర‌వ‌ర్తి
నిర్మాత‌.. ఉష మూల్పూరి
లైన్ ప్రోడ్యూస‌ర్‌.. బుజ్జి
ఐరా డిజిట‌ల్‌– ఎమ్‌.ఎన్‌.ఎస్ గౌత‌మ్‌
డి ఓ పి.. విజ‌య్ సి కుమార్‌
సంగీతం.. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్
ఎడిట‌ర్‌.. కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు, త‌మ్మిరాజు
స్క్రిప్ట్ అసోసియోట్‌.. కాశి న‌డింప‌ల్లి
పిఆర్ ఓ .. ఏలూరు శ్రీను
ప‌బ్లిసిటి డిజైన‌ర్‌.. అనంత్‌
ఆర్ట్‌.. కిర‌ణ్ కుమార్ మ‌న్నె
ఫైట్స్‌.. విజ‌య్ , మ‌ల్లేష్‌
కొరియోగ్ర‌ఫి.. విశ్వ ర‌ఘు, విజ‌య్ ప్ర‌కాష్‌,
లిరిక్స్‌.. భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్‌, శ్రీమ‌ణి, ఒరుగం