స్టూడియో రౌండప్

Wednesday,August 01,2018 - 10:05 by Z_CLU

సాహో :

ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సాహో’ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఆర్.ఎఫ్.సీ లో వేసిన భారీ సెట్ లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రభాస్, శ్రద్దా కపూర్, మురళి శర్మ లతో పాటు మరికొందరు షూట్ లో పాల్గొంటున్నారు. యు.వి. క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ డైరెక్షన్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

సైరా :

మెగా స్టార్ చిరు నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘సైరా’ ఆగస్ట్ 5 నుండి రామోజి ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకోనుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్ ను తీర్చిదిద్దారు. ఈ సెట్ లోనే సైరా కు సంబంధించి భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయనున్నారు యూనిట్. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాత.

అరవింద సమేత : 

ఎన్టిఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ & లవ్ ఎంటర్ టైనర్ ‘అరవింద సమేత’. ఇటివలే రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని కీలక సీన్స్ షూట్ చేసిన యూనిట్ ప్రస్తుతం పోచంపల్లి సమీపంలో ఉన్న ఊరిలో మరి కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. తారక్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హారికా & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాదా కృష్ణ నిర్మిస్తున్నారు.

దేవదాస్ : 

నాగార్జున , నాని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘దేవ దాస్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మొన్నటి వరకూ  నైట్ షూట్స్ చేసిన యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ లోని వివిధ లోకేషన్స్ లో డే షూట్స్ చేస్తుంది. ఇప్పటికే 80  శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న విడుదల చేయనున్నారు మేకర్స్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమలో నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా  నాని సరసన రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

వరుణ్ తేజ్ – సంకల్ప్ మూవీ 

సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ నటిస్తున్న స్పేస్ మూవీ ఇటివలే రామేశ్వరంలో ఒక షెడ్యుల్ ఫినిష్ చేసుకుంది. లేటెస్ట్ గా రామేశ్వరం షెడ్యుల్ కి ప్యాకప్  చెప్పి హైదరాబాద్ తిరిగి వచ్చిన యూనిట్  గ్యాప్ తీసుకోకుండానే ఇమ్మీడియట్  గా మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తుంది. ఆగస్ట్  2 నుండి హైదరాబాద్ లో ఈ షెడ్యుల్ జరగనుంది. ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

 హలో గురు ప్రేమకోసమే 

రామ్ హీరోగా నటిస్తున్న ‘హలో గురు ప్రేమ కోసమే’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటివలే రామ్ , ప్రకాష్ రాజ్ , అనుపమ లపై రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని సీన్స్ షూట్ చేసిన యూనిట్  ఆగస్ట్ 4 నుండి మరో షెడ్యుల్ కి రెడీ అవుతుంది. ఈ షెడ్యుల్ లో రామ్ , ప్రకాష్ రాజ్ లపై మరికొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారు.